గత కొంత కాలం నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన తీరుతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మరోసారి భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్... విరాట్ కోహ్లీపై ఘాటైన విమర్శలు గుప్పించారు. సాధారణంగానే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పుడు ఇతర ఆటగాళ్లు తప్పు చేసినప్పుడు ఘాటైన విమర్శలు చేస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరుపై వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.



 ముఖ్యంగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో... టీమిండియా లో కీలక ఆటగాళ్లు అయినా శ్రేయస్ అయ్యర్ చాహల్ ను  తుది జట్టులో చోటు ఇవ్వకపోవడంపై విరాట్ కోహ్లీ తీరును తప్పుబట్టారు వీరేంద్ర సెహ్వాగ్. శ్రేయస్ అయ్యర్ చాహల్ కు బదులు మనీష్ పాండే సంజు శాంసన్ లకు జట్టు  లోకి తీసుకున్నాడు. దీంతో ఏ కారణంతో శ్రేయస్ అయ్యర్ పై వేటు వేసావు  విరాట్ కోహ్లీ అంటూ ప్రశ్నించాడు వీరేంద్ర సెహ్వాగ్. మనీష్ పాండే 2 పరుగులకే ఔటవ్వగా  23 పరుగులు చేసి అవుటయ్యాడు సంజూ  శాంసన్ .



 అయితే ఏ కారణంతో తొలి టీ20లో అతనిపై విరాట్ కోహ్లీ వేటు వేశాడు అనే ప్రశ్న అడిగేందుకు  శ్రేయస్ అయ్యర్ కు ధైర్యం లేదు... అంతేకాకుండా టీమిండియాలో రూల్స్ అందరికీ వర్తిస్తాయి. విరాట్ కోహ్లీకి తప్ప.. ఎందుకు అతని విషయంలో మాత్రం నిబంధనలని పట్టించుకోరు అర్థం కాదు. అతనికి ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తూ ఉంటాడు. ఫామ్ లో  లేకపోయినా రెస్ట్ తీసుకుంటాడు ఇది తప్పు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీ తీరుపై మండిపడ్డారు. ఇక ప్రస్తుతం జట్టులో నాలుగవ స్థానంలో బాగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ పై వేటు వేయడంతో మాజీ క్రికెటర్లు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: