ఇటీవలే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ లో  అద్భుత విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. కేవలం విజయం సాధించడమే కాదు అసాధారణ రీతిలో పోరాట పటిమతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది టీమిండియా.  ముఖ్యంగా జట్టులో  ఎంతో అనుభవం ఉన్న కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి జట్టుకు  దూరం అయినప్పటికీ కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకొని ఎంతో దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టును బ్రిస్బేన్ లోని గబ్బర్ స్టేడియంలో భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి సారి మట్టికరిపించింది టీమిండియా.



 ఇక ఇటీవలే సీనియర్ ఆటగాళ్లు గాయాల బారినపడి జట్టుకు దూరం అవడంతో ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్లకు సత్తా చాటేందుకు అవకాశం వచ్చింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా భారత జట్టు ఓపెనర్ గా శుబ్ మన్ గిల్   ఇటీవల జరిగిన చివరి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించాడు అనే విషయం తెలిసిందే. ఏకంగా 91 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు  యువ ఆటగాడు.



 అయితే ఇటీవల జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో  91 పరుగులు చేసిన శుబ్ మన్ గిల్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లో  హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు యువ ఓపెనర్  శుబ్ మన్ గిల్. అంతకుముందు ఈ రికార్డు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. కానీ ఇటీవల అద్భుతంగా రాణించిన శుబ్ మన్ గిల్ ఈ  రికార్డును బ్రేక్ చేసి తన పేరును లికించుకున్నారు.  ఇక ఇటీవలే ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ఒక చారిత్రాత్మక విజయం సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: