ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్బుత విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లు స్వదేశం చేరుకొని కుటుంబ సభ్యులతో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇంతలోనే ఫిబ్రవరి 5 నుండి ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే పోరుకు సిద్దం కావలసివుంది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనున్నాయి. అందువల్ల టీమిండియా స్టార్ ఆటగాళ్లు అజింక్య రహానే, రోహిత్‌ శర్మ,లతో పాటు యువ ఆటగాడు  శార్దూల్‌ ఠాకూర్ ముగ్గురు చెన్నై చేరుకున్నారు.‌

  ఇక ఆసీస్ తో జరిగిన సిరీస్ నుండి తప్పుకున్న కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో పాటుగా ‌తో పాటు మిగతా టీమిండియా ప్లేయర్లు నేడు చెన్నైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లందరూ హోటల్‌ లీలా ప్యాలెస్‌లో 6 రోజులపాటు బయో బుబుల్‌లో ఉండనున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రాక్టీస్ ప్రారంభిస్తారు. మొదటి టెస్టు చిదంబరం స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం భారత అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏడాది తరువాత జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది. గత ఏడాది కరోనా కారణంగా ఏ విధమైన అంతర్జాతీయ మ్యాచ్ లను ఇండియాలో నిర్వహించలేదు. గత ఏడాది ఐ‌పి‌ఎల్ సీజన్ కూడా అరబ్ కంట్రీలో ప్రేక్షకులు లేకుండా నిర్వహించారు.

 అయినప్పటికి ప్రేక్షకుల్లో క్రికెట్ పై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఐ‌పి‌ఎల్ ప్రసారం చేసిన చానల్స్ టాప్ టి‌ఆర్‌పి రేటింగ్స్ తో దూసుకుపోయాయి. ఇదిలా ఉండగా ఆసీస్ పర్యటనలో ఘనవిజయం సాధించిన టీమిండియా పూర్తి ఆత్మ విశ్వాసం కూడగట్టుకొని ఇంగ్లాండ్ తో పోరు కు సిద్దం అవుతుంది. కీలక ఆటగాళ్లు ఎవరు జట్టులో లేకపోయినప్పటికి యువ క్రికెటర్లు తమ సత్తా ఏంటో నిరూపిస్తూ భారత్ కు అద్బుత విజయాన్ని కట్టబెట్టారు. ఇక ఇంగ్లాండ్ కూడా ఇటీవల శ్రీలంక జట్టు పై విజయం సాధించి భారత్ తో పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏది ఏమైనప్పటికి ఇరు జట్ల మద్య -పోరు హోరాహోరీ గా ఉండడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: