ప్ర‌స్తుతం క‌రోనా తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దీని దెబ్బ‌కు ఇండియా ఐపీఎల్ 14వ‌ సీజ‌న్ ను వాయిదా వేసింది బీసీసీఐ. కాక‌పోతే లండ‌న్ టూర్‌ ను మాత్రం క‌న్ఫ‌ర్మ్ చేసింది. ఇప్ప‌టికే టీమ్ ఇండియా క్రికెట‌ర్లు లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరి వెళ్లారు. డ‌బ్ల్యూటీసీ సిరీస్ కోసం తెగ క‌ష్ట‌ప‌డుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అ మ్యాచ్‌ ను అన్ని ర‌కాల క‌రోనా నిబంధ‌న‌లు అనుస‌రించి జ‌రిపిస్తున్నారు. అయితే ఈ సిర‌సీ లో పోటీ కూడా తీవ్రంగానే ఉంది.

ఇక మ‌రో మూడు రోజుల్లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దాంతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ విజేత‌ను ముందే చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పేన్‌. టీమిండియా క్రికెట‌ర్లు త‌మ అత్యుత్త‌మ క్రికెట్‌కు కొంచెం ద‌గ్గ‌ర‌గా ఆడినా న్యూజిలాండ్‌పై చాలా ఈజీగా గెలిచి టైటిల్ ఎగ‌రేసుకుపోతుంద‌ని టి్ పేన్ వివ‌రించాడు. చాలా మంది ఎక్స్‌ప‌ర్ట్స్ అభిప్రాయానికి భిన్నంగా పేన్ ఈ విష‌యం చెప్ప‌డం నిజంగా విశేషం. అయితే ఈ మ్యాచ్‌ లో న్యూజిలాండ్ మాత్ర‌మే ఫేవ‌రెట్ అని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ ఇంగ్లండ్ కండిష‌న్స్‌కు వాళ్లు అల‌వాటు ప‌డి ఉండ‌టంతో పాటు ఈమ‌ధ్యే ఆ టీమ్‌పై 2 టెస్ట్‌ల సిరీస్‌ను 1-0 తో గెల‌వ‌డం న్యూజీలాండ్‌ కు బాగానే క‌లిసొచ్చే అంశమ‌ని అంద‌రూ చెబుతున్నారు. ఇక‌పోతే పేన్ వాద‌న వారంద‌రికీ కాస్త భిన్నంగా మ‌రోలా ఉంది.

టీమ్ ఇండియా త‌మ సామ‌ర్థ్యానికి త‌గ్గ‌ట్టు ఏ కొంచెం ఆడితే స‌రే ఈజీగా టైటిల్ గెలుస్తుంద‌న్న‌ది అంచ‌నా పేన్ చెబుతున్నాడు. కాగా ఈ రెండు టీమ్స్‌ పై ఆడిన ఆస్ట్రేలియా జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌ గా వ్య‌వ‌హ‌రించాడు. ఇక న్యూజిలాండ్‌ పై 3-0 తో గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియా చేతిలో మాత్రం 1-2 తో ఓట‌మి చ‌విచూసింది. ఇక న్యూజిలాండ్ మంచి టీమే అని అంతా భావిస్తున్నా మొన్న‌టి సిరీస్‌ లో మాత్రం ఇంగ్లండ్ ఆట అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని చెప్పాలి. మ‌రీ ముఖ్యంగా ఇది క‌చ్చితంగా ఇంగ్లండ్ బ‌ల‌మైన టీమ్ కానే కాద‌ని పేన్ చెప్ప‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: