స్మృతి మందాన... ప్రస్తుతం భారత క్రికెట్ లో ఈ మహిళా క్రికెటర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సాదాసీదా క్రికెటర్గా భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న స్మృతి మందాన ప్రస్తుతం దిగ్గజ క్రికెటర్ గా ఎదుగుతుంది. స్మృతి మందాన  సారి మైదానంలో కుదురుతుంది అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. భారీగా సిక్సర్లు ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టిస్తుంది. ఇక తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ క్రికెటర్.  కేవలం తన ఆట ద్వారా మాత్రమే కాదు తన అందం అభినయంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.



 తన చిలిపి నవ్వుతోనే ఎంతోమంది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల మరోసారి తన బ్యాటింగ్తో అద్భుతం చేసింది స్మృతి మందన. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ బాల్ ఉమెన్ కాంపిటీషన్ టోర్నీలో భాగంగా ఇండియన్ క్రికెటర్ స్మృతి మందాన దుమ్మురేపింది. సదరన్ బ్రేవ్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది స్మృతి మందన. ఈ క్రమంలోనే ఇక ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఏకంగా అదరగొట్టింది. 39 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది స్మృతి మందన. అంతేకాదు ఈ మహిళా క్రికెటర్ ఒంటి చేత్తో జట్టును గెలిపించింది అని చెప్పాలి. మరో పదహారు బంతులు మిగిలి ఉండగానే ఇక మెరుపు బ్యాటింగ్  చేసి విజయాన్ని అందించింది  స్మృతి మందన. దీంతో సదరన్ బ్రేవ్ అద్భుత విజయాన్ని అందుకుంది.



 అయితే మొదట 25 బంతుల్లో కేవలం 29 పరుగులు మాత్రమే చేసింది స్మృతి మందాన. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించింది. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు మూడు సిక్సర్లతో  32 పరుగులు చేసి చెలరేగిపోయింది. అయితే ఇటీవలే వుమెన్ కాంపిటీషన్ టోర్నీలో స్మృతి మందాన చెలరేగి బ్యాటింగ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఈ వీడియో చూస్తుంటే నెటిజన్లు స్మృతి మందాన టాలెంట్ కి ఫిదా అయిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత స్మృతి మందాన కెప్టెన్సీ వహిస్తున్న జట్టు కేవలం 84 బంతుల్లోనే  లక్ష్యాన్ని ఛేదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: