ఈ ఏడాది ఐపీఎల్  సీజన్లో భాగంగా విరాట్ కోహ్లీ అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా మెగా టోర్ని లో  భాగంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలో ఏకంగా మూడు సార్లు గోల్డ్ డక్ గా వెనుదిరిగాడు విరాట్ కోహ్లి. వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ 12 మ్యాచ్ లలో ఇప్పటివరకు చేసింది 216 పరుగులు మాత్రమే అన్న విషయం తెలిసిందే.


 విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత ఎంతో స్వేచ్ఛగా ఆడతాడు అనుకుంటే.. ఇంకా ఒత్తిడి లోనే కనిపిస్తున్నాడు అనే చెప్పాలి. ప్రతి మ్యాచ్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగటం చివరికి నిరాశతో తక్కువ పరుగులకే వెనుదిరిగటం లాంటివి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫామ్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పదేళ్ల కింద విరాట్ కోహ్లీ ఎంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఇక ఇప్పుడు కూడా అలాగే ఆడాలని సూచించాడు. తొలి ఓవర్లు కుదురుకోగలిగితే చాలు కోహ్లీ భారీ స్కోరు చేయగలడు అంటు అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 ఇక విరాట్ కోహ్లీని బెంగళూరు జట్టు కెప్టెన్ డూప్లెస్సిస్ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లాలి అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల క్రితం విరాట్ కోహ్లీకి ఇప్పుడున్న ప్రొఫైల్ లేదు. బ్యాటింగ్లో అద్భుతాన్ని సృష్టించాడు.. మంచి ఫామ్ లో ఉండి టాప్ బ్యాట్స్ మెన్ గా ఎదుగుతున్న విరాట్ కోహ్లీని మళ్లీ ఇప్పుడు చూడాలనిపిస్తోంది. ఇప్పుడు వరకు ఏం చేసాం ఎన్ని రికార్డులు సాధించామని విషయాన్ని మరచిపోవాలి. మంచి ఆరంభం లభిస్తే విరాట్ కోహ్లీ ని ఆపడం ఎవరి తరమూ కాదు. విరాట్ కోహ్లీ 35 పరుగులు చేసాడు అంటే దానిని భారీ స్కోర్లు ఎంతో సులభంగా చేయ గలుగుతాడు అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl