ఇటీవలి కాలంలో టి20 ఫార్మట్ కు ఎంత ఆదరణ పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ ఫలితం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. బ్యాట్స్మెన్లు ఎప్పుడు సిక్సర్లు ఫోర్లు కొడతారు అని నిరీక్షణ గా చూడాల్సిన అవసరం లేదు. నిమిషాల వ్యవధిలోనే విజయం ఎవరి వైపు ఉంది అన్నది  టి20 ఫార్మాట్లో తేలిపోతూ ఉంటుంది. అంతే కాదు ప్రేక్షకులు కోరుకున్నట్లుగానే టీ-20 ఫార్మెట్లో బ్యాట్స్మెన్లు అందరు కూడా సిక్సర్లు ఫోర్ లతో చెలరేగి పోతుంటారూ. దీంతో ఇది ప్రేక్షకులకు బాగా నచ్చేస్తూ ఉంటుంది.


 దీంతో అటు ప్రేక్షకులు టి20 లను ఎక్కువగా ఆదరించడం  మొదలు పెడుతున్నారు. అయితే ఆటగాళ్ళు కూడా టెస్టుల్లో అలసిపోవడం కంటే వన్డేలలో ఆడటం కంటే టి20 లలో ఆడితే డబ్బుకు డబ్బు తో పాటు కూడా క్రేజ్ కూడా వస్తుంది అని భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ మేము ఆడ లేము అంటూ చెప్పేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో రానున్న రోజుల్లో బెస్ట్ ఫార్మాట్  ప్రాబల్యం కోల్పోయే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ కు రానున్న రోజుల్లో ఆదరణ పెంచాలంటే ఏం చేయాలి అనే దానిపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగా టెస్టు క్రికెట్కు ఆదరణ తగ్గకుండా ఉండాలంటే 10 జట్లతో కాకుండా టాప్ సిక్స్ జట్లతోనే మ్యాచ్లను ఆడించాలని మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. ఇక మ్యాచ్లు ఎక్కువ ఉండటం కాదు నాణ్యమైన ఆటను ప్రేక్షకులకు అందించాలని అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు రవిశాస్త్రి. అయితే టీ20 వన్డే క్రికెట్ ను మాత్రం అన్ని జట్లతో ఆడించాలని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్ ను ఫుట్బాల్ లీగ్ లాగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: