కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో గత కొంత కాలం నుంచి దినేష్ కార్తీక్  అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా టీమిండియా ఆడుతున్న టి20 సిరీస్ లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో భాగంగా కీలకమైన ఇన్నింగ్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. 19 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టుకు మెరుగైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించాడు. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన  ప్రదర్శనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే మొదటి టి20 మ్యాచ్ ముగిసిన తర్వాత తన సహచర ఆటగాడు అయినా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడాడు దినేష్ కార్తీక్. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసలు కురిపించాడు. గత జట్లతో పోల్చి చూస్తే ఇప్పుడు ఉన్న భారత జట్టు ఎంతో కొత్తగా ఉంది. నేను ఇప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూన్న అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా కోచ్,  కెప్టెన్ వ్యవహార శైలి ఎంతో నచ్చింది. ఒక ఆటగాడు ప్రదర్శన చేయకపోయినా  అతనికి మద్దతుగా నిలుస్తున్నారు తప్ప నొచ్చుకునేలా మాట్లాడటం లేదని.. అందుకే  టీం బాగా రాణిస్తోందని.. క్రెడిట్ మొత్తం వాళ్ళిద్దరికీ దక్కుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.


 నేను సరిగ్గా బ్యాటింగ్ చేసినా చేయకపోయినా నన్ను ట్రీట్ చేసే విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండడంలేదు. ఇక రానున్న టి20 వరల్డ్ కప్ లో ఆడటమే నా ముందున్న లక్ష్యం అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో జట్టు విజయాల్లో ఇద్దరం భాగం అయితే బాగుంటుంది అంటూ అశ్విన్ ను ఉద్దేశిస్తూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. కాగా ఐదు టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యాన్ని సంపాదించింది అన్న విషయం తెలిసిందే. అంతకుముందు 3-0 తేడాతో వన్డే సిరీస్  వైట్వాష్ చేసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: