సాధారణంగా పాకిస్తాన్ క్రికెట్లో కేవలం బౌలర్లు మాత్రమే ప్రధాన బలంగా కొనసాగుతూ ఉండేవారు. ఎన్నో ఏళ్ల నుంచి పాకిస్తాన్ జట్టులో ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అన్ని జట్లలో బ్యాట్స్మెన్లు ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంటే పాకిస్తాన్ జట్టులో మాత్రం బౌలర్లదే ఎక్కువగా హవా నడుస్తూ ఉండేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం బ్యాటింగ్ లో కూడా తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ అదరగొడుతూ ఉన్నారు కొంతమంది పాకిస్తాన్ బ్యాట్స్ మెన్లు.  ముఖ్యంగా పాకిస్తాన్ ఓపెనింగ్ జోడి అయితే ప్రత్యర్థి జట్లు  అందరికీ కూడా ఒక పెద్ద సవాలును విసురుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఏకంగా పాకిస్తాన్ జట్టు విజయాలలో ఓపెనింగ్ జోడినే కీలకపాత్ర వహిస్తుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ జట్టుకు ఓపెనింగ్ జోడి వెన్నుముకగా మారిపోయింది అని చెప్పాలి. కెప్టెన్ బాబర్ అజాం మహమ్మద్ రిజ్వాన్  ఓపెనర్లుగా బరిలోకి దిగుతూ భారీ టార్గెట్లను సైతం ఎంతో అలవోకగా చేదిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి విధ్వంసం సృష్టిస్తూ ఎన్నో రికార్డులను సైతం అలవోకగా బద్దలు కొడుతున్నారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి పాకిస్తాన్ ఓపెనర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఎక్కడ తడబాటుకు గురికాకుండా భారీ పరుగుల లక్ష్యాన్ని ఎంతో అలవోకగా చేదించారు. ఇద్దరు ఓపెనర్లు కలిసి 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే  ఎన్నో అరుదైన ప్రపంచ రికార్డులను కొల్లగొట్టారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఎక్కువసార్లు 150 కి పైగా పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడిగా బాబర్ అజం మహమ్మద్ రిజ్వాన్ ఓపెనింగ్ జోడి అర్దైన రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు అంతర్జాతీయ టి20లో ఐదు సార్లు 150 కి పైగా పరుగులు స్కోర్ చేసింది ఈ ఓపెనింగ్ జోడి.

మరింత సమాచారం తెలుసుకోండి: