గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియా తిరుగులేని విధంగా ప్రస్థానాన్ని  కొనసాగిస్తుంది వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా తో తిరువనంతపురం వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ప్రత్యర్థి పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బౌలర్లు బాగా రాణించడంతో ప్రత్యర్థిని కేవలం 16 పరుగులకు మాత్రమే పరిమితం చేయగలిగింది భారత జట్టు.


 ఇక ఆ తర్వాత లక్ష చేదనలో కూడా బ్యాట్స్మెన్లు  బాగా రానించడంతో ఎంతో సులభంగానే టార్గెట్ చేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే టీమిండియా విజయాలు అయితే సాధిస్తుంది కానీ ఒక్క విషయం మాత్రం టి20 వరల్డ్ కప్ కి ముందు జట్టును కలవరపెడుతోంది. అదే 19వ ఓవర్. టి20 ఫార్మాట్లో 19వ ఓవర్ ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టు విజయాలను తారుమారు చేసే ఓవర్ అని కూడా విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇదే ఇప్పుడు టీమ్ ఇండియాకు శాపంగా మారిందేమో అని అనిపిస్తుంది. 19 ఓవర్ ఎవరు వేసిన కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.


 బౌలర్ మారుతున్న పరుగులు సమర్పించుకోవడంలో మాత్రం గత కొంతకాలం నుంచి మార్పు రావడం లేదు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. భువనేశ్వర్ కుమార్, బుమ్రా, ఆవేశ్ ఖాన్ ఇలా ఎవరు వేసిన కూడా పరుగులు సమర్పించుకున్నారు. చివరికి ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన మ్యాచ్లో అర్షదీప్ అయినా బాగా రానిస్తాడని  అనుకున్నారు. కానీ ముందు వేసిన మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్షదీప్ 19 ఓవర్లో 17 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా తో జరిగిన మూడో టి20 లో బుమ్రా 18పరుగులు ఇచ్చాడు. ఇలా ఇటీవల కాలంలో 19వ ఓవర్ టీమిండియా కు శాపంగా మారింది అన్నది తెలుస్తుంది. ఈ సమస్యను ఎలా అధికమిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: