గత కొన్ని రోజుల నుంచి టీమిండియా మహిళల జట్టు అదరగొడుతుంది అని చెప్పాలి. ఒకవైపు బౌలింగ్ విభాగంలో మరోవైపు బ్యాటింగ్ విభాగంలో కూడా తమకు తిరుగులేదు అని నిరూపిస్తోంది. ఈ క్రమంలోనే అటు భారత మహిళల జట్టులో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న నేపథ్యంలో ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసే ర్యాంకింగ్స్ లో తమ స్థానాలను మెరుగుపరుచుకుంటూ అంతకంతకు పైపైకి దూసుకుపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టి20 ఫార్మాట్ కి సంబంధించిన ర్యాంకింగ్స్ ప్రకటించగా భారత జట్టు మహిళా స్టార్ క్రికెటర్ జెమియా రోడ్రిక్స్ దుమ్ము రేపింది అని చెప్పాలి.


 తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టాప్ 10 లో చోటు దక్కించుకోని జెమియా రోడ్రిక్స్ ఇటీవల కాలంలో తన అద్భుతమైన ప్రదర్శనలతో మొదటిసారి ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది అని చెప్పాలి. ఒకేసారి నాలుగు స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకుంది ఈ స్టార్ బ్యాటర్. ఇక ఏకంగా జెమియా రోడ్రిక్స్ టాప్ టెన్ లో నిలవడంతో అటు అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.. అయితే గత కొంతకాలం నుంచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతుంది ఈ బ్యాటర్. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో కూడా అదరగొడుతుంది అని చెప్పాలి.


 అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర వహించింది జెమియా రోడ్రిక్స్.  ఇటీవల యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో కూడా మరోసారి 75 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది అని చెప్పాలి.  ఇంకోవైపు భారత కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ కూడా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానాన్ని సొంతం చేసుకుంది.  కాగా ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ ముని బ్యాటర్ల ర్యాంకింగ్లో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇక ఇదే లిస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ మేగ్ లానింగ్ రెండవ ర్యాంకు సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: