ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరి ఫోన్లలో కచ్చితంగా ఉండే యాప్ వాట్సాప్. ప్రతి ఒక్కరూ రోజు వారీ అవసరాలకు, ఆఫీస్ ల్లో కమ్యూనికేషన్ కోసం ఇలా వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడం, డేటా కోసం పెట్టే ఖర్చు తక్కువగా ఉండటం, సామాజిక మాధ్యమాలపై వెచ్చించే సమయం ఎక్కువ కావడం రోజువారీ వాట్సాప్‌ వినియోగం పెరిగేందుకు కారణాలు అని అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు.

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. వాట్సాప్ యూజ్ చేసేవాళ్లు.. త‌మ అకౌంట్ సుర‌క్షితంగా చూసుకోవ‌డం చాలా అవ‌స‌రం. వాట్స్‌యాప్ సెక్యూరిటీ టిప్స్‌లో మొదిటిది లాక్. మీ వాట్స్‌యాప్ అకౌంట్‌కు పిన్ లేదా పాస్‌వర్డ్ లాంటి సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ అకౌంట్ మరింత సురిక్షితంగా ఉంటుంది. అలాగే మోసపూరిత సందేశాలను నమ్మి ఆన్‌లైన్ స్కామ్‌లలో ఇరుక్కోకండి. గుర్తుతెలియన నంబర్లను బ్లాక్ చేయ‌డం చాలా అవ‌సరం.

 

ఒక‌వేళ మీ ఫోన్ పోయినట్లయితే వెంటనే మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీ డేటా సుర‌క్షితంగా ఉంటుంది. అదేవిధంగా, వాట్స్‌యాప్ వెబ్ ఫీచర్‌ను వినియోగించుకున్న తరువాత లాగ్‌అవుట్ కావటం అస్స‌లు మర్చిపోకండి. మ‌రీ ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలను వాట్స్‌యాప్ ద్వారా అస్స‌లు షేర్ చేయవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: