పరస్పర పోటీ నేపథ్యంలో మీడియా తన విశ్వాసం కోల్పోతుంది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ కొన్ని మీడియా సంస్థలు ప్రజల్లో తమ  నమ్మకాన్ని కోల్పోతున్నాయి. గతంలో వాతావరణ శాఖ వారికి ఉన్నటువంటి కొద్దిపాటి సాంకేతిక పరిజ్ఞానంతో వరదలు మరియు ప్రకృతి వైపరీత్యాలను సంబంధించిన సమాచారాన్ని ముందుగా అంచనా వేసేది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా లెక్కించేది. దీనికి అనుగుణంగా ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా మీడియాకు ప్రకటనలు వీళ్ళ చేసేది. అయితే ఈ ప్రకటనలు అంశాల్లో ఎక్కువ శాతం వాస్తవికంగా తెలిసేది కాదు. వాతావరణ శాఖ ముందస్తు అంచనాల విఫలమయ్యే వి. రుతుపవనాల రాకపోకలు అంచనాలకు భిన్నంగా సాగేవి. దీంతో ప్రకటించిన రీతిలో వర్షాలు పడేవి కావు.

లేదా ముందస్తు పట్టణ లేని సమయాల్లో భారీ వర్షాలు కురిసేవి.  పక్క ప్రాంతానికి వర్షాల బెడద ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఇటువైపు వర్షాలు కురవడం మొదలైంది. అలాగే ఉష్ణోగ్రతను కొనాలి కూడా పలు సందర్భాల్లో వాస్తవాలకు దూరంగా ఉండేవి. దీంతో అంచెలంచెలుగా వాతావరణశాఖ ప్రకటనల పట్ల ప్రజల విశ్వాసం పోయింది పైగా ఈ వర్షం వస్తుంది అంటే రాదని, రాదంటే వస్తుంది అని ప్రచారం హాస్యోక్తులు పెరిగాయి. అంచలంచలుగా ఉపగ్రహాలు పెరిగాయి వాతావరణం కచ్చితంగా అంచనా వేసే స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. దీంతో ముందుస్తు ఒక సంకేతాన్ని వాతావరణ శాఖ  సమర్థవంతంగా క్రోడీకరించ గలుగుతుంది. రుతుపవనాల ప్రయాణం వాయుగుండం హెచ్చరికలు, పిడుగుల హెచ్చరికలు కూడా ఐందిస్తోంది.

 గతంలో లాగా వీటిని మీడియా ద్వారా జారీ చేస్తోంది. అయితే వాతావరణ శాఖ అంటే  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తామే ముందు ఇవ్వాలన్న పరస్పర పోటీతో పూర్తిస్థాయి సమాచారం లేకుండానే, పాత ఫోటోలు కథనాలను బట్టి అలాగే వీడియోలను సమీకరించి ఒకవైపు  పత్రికల్లో మరోవైపు టీవీ ఛానల్లో ప్రచారం చేస్తున్నారు. ఒడిషా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటిన గులాబ్ తుఫానుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నగరాలు మొత్తంమీద రాకపోకలు స్పంబిస్తాయి అని పలుచోట్ల కాలనీలోకి నీరు చేరిందని  చాలా కథనాల్లో వచ్చింది. ఊరంతా నీటితో మునిగిపోయిన అంటూ  కథనాలు కూడా వచ్చాయి. వీటిని  చూసినటువంటి విదేశాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు భయపడి ఫోన్ల ద్వారా  ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. ఇలా ఉన్నదాన్ని లేని దానీగా, లేనిదాన్ని ఉన్నదాని గా సృష్టించి చెప్పడం వలన ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: