గ్రేటర్ ఎన్నికల నేపద్యంలో ప్రదాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.నువ్వా నేనా అనట్టుగా ప్రచారంలో ముందుకు సాగుతూ రాజకీయ విమర్శలు గుప్పిస్తు హిట్ పెంచుతున్నారు నాయకులు. 

తాజాగా ఛార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆయన నిలిచున్న స్టేజ్ కూలింది.పాతబస్తీలోని మొగల్ పురా డివిజన్‌లో గ్రేటర్ ఎన్నికల్లో నిలిచున్న ఎంఐఎం అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నాడు.స్టేజ్ సరిగా వుండకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది.

అందరూ చూస్తుండగానే స్టేజ్ పై కూర్చున్న ఆయన ఒక్కసారిగా కింద పడ్డారు. వెంటనే పక్కనే ఉన్నవారు ఆయన్ను పైకి లేపారు.ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: