వ్యాక్సిన్ పేరు వినగానే, వామ్మో..ఇంజక్షనా అని కొంతమంది భయపడుతూ ఉంటారు. అయితే అలాంటి భయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. వారి కోసం ఒక మొక్కను బాగా అభివృద్ధి చేస్తున్నారట. ఈ మొక్క ప్రతి ఒక్కరు తినగలిగే మొక్కలుగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ మొక్కను మనం తింటే చాలు వ్యాక్సిన్ వేయించుకున్నట్లే అని తెలియజేస్తున్నారు. ఆ వివరాలను చూద్దాం.

ఆ మొక్క ఏదో కాదు..పాలకూర మొక్క. ఈ మొక్క తింటే చాలు మన శరీరంలోకి వ్యాక్సిన్ చేరిపోతుంది అని తెలియజేస్తున్నారు..కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. అందుకోసం ఈ వ్యాక్సిన్ ప్లాంట్ ను బాగా అభివృద్ధి చేస్తున్నారట. ఈ మొక్కల ద్వారా మనుషులకు కరోనా సోకకుండా, ఉండేందుకు ఈ వ్యాక్సిన్ ను  ప్రచారం చేస్తున్నామన్నుట్లు గా తెలియజేస్తున్నారు.

ఇక ఈ టీకా మొక్కలు..కరోనా వైరస్ తో పోరాడే రోగనిరోధక శక్తికి సహాయ పడుతుందట. కోవిడ్ వ్యాక్సిన్ లలో వాడేటువంటి.. ఫైజర్ బయోటెక్, మోడెర్న తయారు చేసినటువంటి టెక్నాలజీతోనే ఈ మొక్కలను తయారు చేస్తున్నారట. ఇంజక్షన్ ద్వారా అయితే సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడంతో పరిశోధకులు, ఈ మొక్కలతో అయితే ఇబ్బంది ఉండదు అన్నట్లుగా తెలియజేస్తున్నారు.

ఈ మొక్కల ద్వారా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ తో ఎటువంటి ప్రమాదం ఉండదు..అంతేకాకుండా వీటిని రవాణా చేయడం కూడా చాలా సులువు అవుతుందని తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా మొక్కలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంచితే అందులో ఉండే వ్యాక్సిన్ సరిపోదని వారి నమ్మకం. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే అతి తక్కువ ధరల తోనే అన్ని దేశాలు ఉపయోగించుకోవచ్చని.. అమెరికన్ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

కేవలం ఒక మొక్క మాత్రమే ఒక మనిషికి తయారు అయ్యే అంత టీకాను మాత్రమే సమృద్ధి చేయగలదు. అంతేకాకుండా వీటిని పొలంలో రైతులు కూడా పండించగలరని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇక ఈ పరిశోధన విజయవంతమైతే  టీకా లాగా పనిచేస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: