
కానీ బెంగళూరులో మాత్రం కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది అని ఆ కాలుష్యం కారణంగా బెంగళూరులో ఉండే ప్రతి ఒక్కరు కూడా రకరకాల రోగాల భారినపడుతున్నారు అంటూ వార్తలు వినిపించాయి . ఇప్పుడు ఏకంగా ఒక జంట "బెంగళూరుకి రానే రావద్దు అని .. బెంగళూరు నెమ్మదిగా మిమ్మల్ని చంపేస్తుంది " అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనితో ఒక్కసారిగా ఆ భార్యాభర్తల పేర్లు వైరల్ అయ్యాయి. "సిటీలో కాలుష్యం ఎక్కువ అయిపోతుంది అని దానివల్ల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నామని .. ఆ కారణంగానే సిటీ నుంచి వెళ్లిపోతున్నామని బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్న అశ్విన్ - అపర్ణ చెప్పుకు వచ్చారు".
గత రెండేళ్లుగా సిటీలో నివసిస్తున్నామని పూర్తిగా వాయు కాలుష్యం పెరిగిపోయింది అని ..గాలి నాణ్యత సరిగ్గా లేదు అని ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేశారు. "బెంగళూరు నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని చంపేస్తుంది ..ఇక్కడికి రానే రావద్దు.. ఎవరు దీనిని సరిగా పట్టించుకోవడం లేదు సిటీలో స్వచ్ఛమైన ఖాళీ గొప్ప వాతావరణం ఉంది అని అనుకుంటున్నారు.. అది కానే కాదు బెంగుళూరులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాద స్థాయిలో ఉంది "అంటూ పరోక్షకంగానే బెంగుళూరు రావద్దు అని చెప్పుకొచ్చారు అశ్విన్ - అపర్ణ .
ఫిబ్రవరిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 297 నమోదు అవ్వగా ఇది అనారోగ్యకరం అంటూ ప్రమాదకరం అంటూ నిప్పుణులు చెప్పుకొస్తున్నాను. అయితే ఈ వీడియోకి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొంతమంది నిజమే బెంగళూరు వాతావరణం పూర్తిగా మారిపోయింది అంటుంటే మరి కొంత మంది మాత్రం అన్ని చోట్ల ఇలానే ఉంది ..బెంగుళూరు ఒక్కటే కాదు మీ ఓవరాక్షన్ ఆపండి అంటున్నారు. "నిజం చెప్పినందుకు ధన్యవాదాలు ఇటువంటి సమస్యతోనే నేను బాధపడ్డ అందుకే వచ్చేసా ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్న" అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మీరు చెప్పింది 100% నిజం కానీ ఈ జనాలు అది పట్టించుకోరు అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ దంపతులు పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. మరి కొంతమంది బెంగుళూరు వాసులు ఈ వీడియో పై ఫైర్ అవుతున్నారు..!