తాత్కాలిక అవసరాల కోసం మీకున్న టాలెంటును పణంగా పెట్టవద్దు. ఆలస్యమైనా సరే  మీ టాలెంటుకు సరిపడే ఉద్యోగాన్ని మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం. లేదంటే మీ బంగారు భవిష్యత్తును మీరు కోల్పోతారు. సరైన సమయం కోసం ఎదురు చూసి.. సరైన ఉద్యోగంలో చేరండి.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం వేట ప్రారంభిస్తున్నారు. కానీ అందరికీ తగిన అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం సరైన ఉద్యోగ అవకాశాలు మనకు లేకపోవడమే. దీనికి కారణాలు ఏమైనా అయ్యి ఉండవచ్చు కానీ నష్టపోతున్నది మనమే.

కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉద్యోగాలను ఇచ్చే కంపెనీలు మాత్రం మాకు మంచి నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దొరకడం లేదు అంటున్నాయి. ఇటువంటి సమయంలో విద్యార్థులు అవసరం కోసం ఏ ఉద్యోగమైనా పర్వాలేదు అనుకుని చేరుతుంటారు. ఉద్యోగంలో చేరే ముందు ఎవరికి వారు ఒకసారి ప్రశ్నించుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఓకే అనుకుంటేనే... ఆ ఉద్యోగంలో చేరాలి. ఒకవేళ మీకు వ్యతిరేక సమాధానాలు వస్తే... మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకండి. తాత్కాలిక అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగంలో చేరి... బంగారు భవిష్యత్తు కోల్పోకూడదు కదా.

ఇక్కడ వారికున్న ప్రతిభ అంతా కూడా అవసరమైన చోట ఉపయోగపడడం లేదు, తద్వారా ఒక కంపెనీ ఒక మంచి వ్యక్తి సేవలను కోల్పోయింది అనవచ్చు. ఫలితంగా కొన్నాళ్లకు... అది నచ్చక మళ్లీ.. ఉద్యోగ వేటలో పడుతారు. దీనివల్ల వారి ప్రతిభ, సమయం, వయసు వృథా అవుతుంది. అలా కాకుండా మీరు ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగంలో చేరాలి అనుకుంటే, ముందుగా అందులో మీరు పొందే ఉపయోగాల గురించి తెలుసుకోవాలి. అక్కడ మీరు ఉండడానికి కావలసిన వనరులను వారు సమకూర్చుతారా లేదా తెలుసుకోవాలి...ఇలా ముందు వెనుక అన్ని విషయాలను ఆలోచించుకుని ఉద్యోగంలో చేరడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: