కుటుంబం మనకు జీవితాన్ని అందిస్తుంది. పద్ధతులు, నడవడిక మనకు మన తల్లితండ్రులు నేర్పుతారు. ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, మాట్లాడే పద్ధతి, గుణగుణాలు మన కుటుంబ సభ్యుల నుండి అలాగే మన చుట్టూ ఉండే పరిసరాల నుండి నేర్చుకుంటాము. చదువు సంధ్యలు, క్రమశిక్షణ గురువుల వద్ద నేర్చుకుంటాం. అలవాట్లు అనేవి మన స్నేహితులను చూసి నేర్చుకుంటాము మరియు అలవరుచుకుంటాము. ఇలా మన చుట్టూ ఉన్న సమాజం మనపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. కానీ వయసు పెరిగే కొద్ది ప్రతి ఒక్కరి జ్ఞానం, ఆలోచించే గుణాలు పరిణితి చెందుతాయి. ఏది మంచి ఏది చెడు అని గుర్తించగల జ్ఞానం మనకి వస్తుంది. అలాంటప్పుడు మనం చేసే ప్రతి పనిని ఈ రెండింటితో పోల్చుకుని మంచి మార్గాన్ని ఎంచుకోవాలి.

ప్రతి సందర్భంలోనూ మన ముందు మంచి , చెడు అన్న రెండు  ఆప్షన్స్ ఉంటాయి.  ఏది ఎంచుకోవాలి అన్నది మనపై ఆదారపడి ఉంటుంది. చుట్టూ ఉన్న పరిసరాలు మనల్ని ప్రభావితం చేయవచ్చు, కానీ తుది నిర్ణయం పూర్తిగా మనదే అవుతుంది.  ఉదాహరణకు ఒక కాలేజీ చదివే కుర్రవాడు చెడ్డ పిల్లవాడితో స్నేహం చేస్తుండవచ్చు.  కానీ అతడు తన స్నేహితుడిలాగే నా ఫ్రెండ్ చేస్తున్నపుడు, నేను చేస్తే తప్పేంటి అనుకుని చెడు అలవాట్లకు అలవాటు పడితే, అలాంటివి మన భవిష్యత్తుని నాశనం చేస్తాయని గుర్తించి, మళ్ళీ అటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండే విధంగా మారాలి. అప్పుడే ఆ కుర్రాడి సంస్కారం బయట పడుతుంది.  సరైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది.

మనము మంచిగా బ్రతుకుతుంటే సమాజంలో మనకంటూ తగిన గుర్తింపు ఉంటుంది. అందరూ మన తల్లితండ్రులకు గౌరవాన్ని ఇస్తారు. ఇదంతా కేవలం,  ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనే వచ్చేది కాదు. ప్రతి  సందర్భంలోనూ మనల్ని మనం జడ్జ్ చేసుకుని, ఒక పద్ధతి ప్రకారం ఆత్మవిశ్వాసంతో ముందుకు నడచినప్పుడే ఇది సాధ్యమౌతుంది. ప్రతిసారి రేపటి నుండి మారొచ్చు లే, లేదా ఇంకో పది రోజుల తరువాత మారొచ్చు లే  అనుకుంటే కాదు. ప్రతి ఒక్క నిమిషం ఎంతో విలువైనది. నిర్ణయం తీసుకున్న క్షణం నుండే ఆచరణలో పెట్టాలి. ఆ దిశగా మీచుట్టూ ఉన్నవారిని మంచి వారుగా మారేందుకు వారికి ప్రేరణ కలిగించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: