ఎంతోమంది ఏదో సాధించాలని ఆరాటపడుతుంటారు. కొంతమంది అనుకున్న విజయాన్ని సాధిస్తారు. మరి కొందరు ఒకరంగంలో వెళుతూ వివిధ లక్ష్యాల వైపు తమ మనసును మళ్ళిస్తుంటారు. అలాంటి ఇద్దరి విజయ గాథ ఇవాళ మనము తెలుసుకోబోతున్నాము. దేశ రాజధాని ఢిల్లీలో ఐఐటీ చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ హ్యారీ సెహ్రావత్ మరియు అర్చిత్ అగర్వాల్ లు చేసిన ఒక వినూత్న ఆలోచనకు దేశమంతా ప్రశంసిస్తోంది.  అదేమిటో ఒకసారి చూద్దాం. మహిళలకు సాధారణంగా చాలా సహజమైన ప్రక్రియ రుతు చక్రం. దీని గురించి మన దేశంలో మాట్లాడడానికి హక్కును కల్పించలేదు. దీని గురించి మాట్లాడితే ఏదో పాపం చేసినట్లుగా భావిస్తున్నారు. స్త్రీలు సైతం వారు పనిచేసే ఆఫీసులలో ఈ విషయం గురించి చెప్పడానికి చాలా భయపడుతుంటారు. ఈ ఋతుస్రావం సమయంలో మహిళలు ఎంతో వేదనను అనుభవిస్తారు. ఇలా ప్రతి మహిళ నెలకు మూడు రోజులు ఈ బాధను అనుభవిస్తూ ఉన్నారు. అందుకే మహిళలకు భూదేవి అంత ఓపిక సహనం అంటూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. 

ఒక సారి వీరు ఐఐటీ పరీక్షలు రాస్తున్న సమయంలో వీరి స్నేహితురాలు ఋతుస్రావం కారణంగా ఎంతో బాధపడడం వీరిద్దరూ గమనించారు. ఈ బాధను ప్రత్యక్షంగా చూసిన తర్వాత దీనిని పరిష్కరించడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు.  ఇలా మహిళలు ఆ క్లిష్టమైన సమయంలో కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఎంతో ఆలోచించారు. దాని కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు. దీని కోసం అవసరమైన అన్ని విషయాలను ఉదాహరణలతో సహా సేకరించారు. ఉత్పత్తి చేయడం, శాంపిల్ టెస్ట్ చేయడం, ఆ ప్రొడక్ట్ ను మార్కెటింగ్ చేయడం, వీటిని వాడే వారు ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారేమో  ప్రత్యేక బృందంతో ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకోవడం వంటివి చేస్తూ, మళ్లీ కస్టమర్స్ చెప్పిన సమస్యలను పరిష్కరించుకుంటూ వెళుతున్నారు.
ఈ ప్రొడక్ట్ ను మొదటగా అక్కడ పనిచేసే వర్కర్స్ వాడి, ఎలా ఉందనే ఫీడ్ బ్యాక్ ను క్వాలిటీ టీమ్ కు చెబుతారట. ఇలా ఈ ప్రక్రియ కాన్సెప్ట్ నుండి తయారుచేసే వరకు 14 నెలల సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఇలా వీరిద్దరూ స్టార్ట్ చేసిన ఈ ప్రొడక్ట్ ఇప్పుడు 50 లక్షల కస్టమర్స్ ను కలిగి ఉంది. అంతే కాకుండా ఒక నెలకు 25 శాతం వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఇలా మేము సంవత్సరానికి  30 కోట్ల టర్న్ ఓవర్ ను చేయగలుగుతున్నాము అని పేర్కొన్నారు. ఈ విధంగా వీరిద్దరూ ఒక 2018 లో హాస్టల్ లైఫ్ నుండి ప్రారంభించి ఎంతో హార్డ్ వర్క్ మరియు డెడికేషన్ తో ఇప్పుడు ఢిల్లీలో 50 మందితో ఒక ప్రత్యేక టీమ్ ను లీడ్ చేస్తున్నారు. ఇలా 2018 లో స్త్రీల పరిశుభ్రత కోసం ఉపయోగించే ''సన్ఫే'' ను ఆవిష్కరించారు. ఈ ప్రొడక్ట్ ప్యాక్ లో స్టాండ్ పి డివైజ్, ఒక లిక్విడ్ వాష్, పాడ్స్, ఫ్యాంటీ లైనర్స్, పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ మరియు మెన్స్ట్రుఅల్ కప్స్ ఉంటాయి. వీటి వలన మహిళలు ఋతుస్రావం సమయంలో ఎక్కువ బాధ పడకుండా దోహదపడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: