ప్రధాని మోడీ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు అరుదైన అవకాశం ఇచ్చారు. ఈ ఆగస్ట్ 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వారిని ప్రత్యేకంగా ఎర్రకోటకు ఆహ్వానించనున్నారు. ఈసారి అత్యధికంగా భారత్‌ నుంచి 120 మంది వరకూ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లారు. ఈ స్థాయిలో ఒలింపిక్స్‌కు ఇండియా నుంచి క్వాలిఫై కావడం గతంలో ఎన్నడూ లేదు.

అందులో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈసారి క్వాలిఫై అయిన వారిలో దాదాపు సగం మంది మహిళలే కావడం విశేషం. ఈసారి 56 మంది మహిళలు దేశం తరపున టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం మన ఖాతాలో రెండు పతకాలే వచ్చాయి. ఆ రెండు తెచ్చింది కూడా మహిళలే కావడం విశేషం. ఒలింపిక్స్‌ కు వెళ్లే ముందు కూడా ప్రధాని క్రీడాకారులతో జూమ్‌లో సమావేశం అయ్యారు. వారిలో ఉత్సాహం నింపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: