దేశంలో బీసీలకు 50 శాతం పదవులు కట్టబెడుతూ జీవో ఇచ్చిన సీఎం జగన్ ఒక్కడే అంటున్నారు వైసీపీ ఎంపీలు.. బీసీలకు 50 శాతం పదవులు ఇస్తూ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ఏకంగా చట్టమే చేశారని గుర్తు చేస్తున్నారు. అలాగే మొత్తం కార్పొరేషన్లలో 109 పదవులు బీసీలకు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అన్ని పథకాల్లోనూ బీసీలకు జగన్ పూర్తి న్యాయం చేస్తున్నారని.. ఏదో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు కాకుండా, నిరుపేదలు అభివృద్ధి చెందేలా జ‌గ‌న్ కృషి చేస్తున్నారని వైసీపీ ఎంపీలు అంటున్నారు.

సీఎం జగన్‌ ఈ విషయంలో ఒక తత్వవేత్త,  సిద్దాంతకర్త అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. జగన్‌ వల్లనే న్యాయం జరుగుతోందని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలు నమ్మకంతో ఉన్నారంటున్న వైసీపీ ఎంపీలు.. అనేక రాష్ట్రాల వారు జగన్‌ను అభినందిస్తున్నారంటున్నారు. బీసీల సంక్షేమం, అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్న వైసీపీ ఎంపీలు.. దేశంలో బీసీలు దాదాపు 75 కోట్లు ఉన్నా వారికి తగిన ప్రాతినిథ్యం లభించడం లేదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: