దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఎంత‌లా క‌రోలు చాస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌న‌దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కు 8 వేలు దాటింది. లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా కొనసాగుతున్న కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 909 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆలాగే మరో 34 మంది మరణించినట్లు తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8356కు చేరుకుంది. ఇందులో ఇప్పటివరకు 716ని డిశ్చార్జ్‌ చేయగా.. 273 మంది చనిపోయారు. ప్రసుత్తం 7367 కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.   

 

ఇక కేసీఆర్ తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా... చాలా స్ట్రిక్ట్‌గా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నా జ‌నాలు కొద్ది రోజులు బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం రోడ్ల‌మీద‌కు వ‌చ్చేస్తున్నారు. ఆదివారం హైద‌రాబాద్‌లో పలు చోట్ల్ జ‌నాలు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఫిష్‌, మ‌ట‌న్‌, చికెన్ షాపుల వ‌ద్ద జ‌నాలు విప‌రీతంగా గుమికూడి ఉన్నారు. అదే టైంలో అటు కూర‌గాయ‌ల షాపుల‌తో పాటు రైతు బ‌జార్ల వ‌ద్ద కూడా భారీ ఎత్తున జ‌నాలు ఉన్నారు. కేసీఆర్ ఇంత సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చినా జ‌నాలు కీల‌క టైంలో రోడ్ల‌మీద‌కు రావ‌డం ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: