విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం తర్వాత ఏపీ సర్కార్ ఇప్పుడు జాగ్రత్తలు పడుతుంది. ప్రజల ప్రాణాలను దృష్టి లో పెట్టుకుని ఏపీ సర్కార్ వ్యవహరిస్తుంది. తాజాగా సిఎం వైఎస్ జగన్.. పర్యావరణ పరిరక్షణ యాక్ట్ రూపకల్పన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

 

రెడ్ ఆరెంజ్ జోన్ కంపెనీలు ప్రజల మధ్య ఉండకూడదు అని స్పష్టం చేసారు. పరిశ్రమల్లో కాలుష్యం ప్రమాదకర పదార్ధాలపై నిరంతరం సమీక్ష ఉండాలని ఆయన స్పష్టం చేసారు. రెడ్ ఆరెంజ్ జోన్ కంపెనీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రజలకు ఎప్పుడు ఆ కంపెనీలు నిర్ణీత దూరంలో ఉండాలని లేదంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు వస్తాయని ఆయన హెచ్చరించారు. కాగా విశాఖ విషయంలో సిఎం జగన్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: