దదాపు 50 రోజులుగా మూసేసి ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మళ్ళీ విమాన రాకపోకలకు సిద్దమవుతుంది. అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటేషన్ చేయడానికి గానూ ఆటోమేటిక్ శానిటేషన్ మెషిన్ లను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా ప్రయాణికుల లగేజిని కూడా పూర్తి స్థాయిలో శానిటేషన్ చేస్తారు. 

 

అలాగే ప్రయాణికులు అందరికి స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని కచ్చిత౦గా అనుమానం ఉంటే క్వారంటైన్ చేస్తారు. వాళ్ళకు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ కూడా ఉండే విధంగా జాగ్రత్తలు పడుతున్నట్టు సమాచారం. కాగా కేంద్రం లాక్ డౌన్ మినహాయింపు లలో భాగంగా అంతర్జాతీయ విమానాలు మినహా దేశీయ విమానాలకు అనుమతి ఇచ్చింది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: