స్వస్తిక్ గుర్తు మాత్రమే వచ్చిన బ్యాలెట్ లను లెక్కించాలి అని హైకోర్ట్ చెప్పగా ఇంకా తమకు ఆదేశాలు అందలేదు అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇంకా హైకోర్టు ఉత్తర్వులు అంద లేదని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. స్వస్తిక్ సింబల్  పై క్లారిటీ ఇవ్వని అధికారులు.. ఆదేశాలు వచ్చిన తర్వాత చెప్తామన్నారు. దీనితో ఎన్నికల సంఘం తీరుపై ఏజెంట్ లు  అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ తీరు పై ఉత్కంఠ కొనసాగుతుంది. బిజెపి ఏజెంట్లు ఆందోళన బాట పట్టే ఆలోచనలో ఉన్నారు.

ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు విషయంలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. గోషా మహాల్ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు బ్యాలెట్ బాక్స్ లో ఉన్న ఓట్లపై అనేక అనుమానాలు వచ్చాయి. ఇక ఎన్నికల సంఘం తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: