WTC ఫైనల్ ప్రారంభ‌మైంది. రెండో రోజు వ‌రుణుడు క‌రుణించ‌డంతో మ్యాచ్ ప్రారంభ‌మ‌వ్వ‌గా టాస్ గెలిచిన కీవీస్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. నెమ్మ‌దిగా బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త ఓపెనర్లు స్పీడ్ పిచ్‌పై బాల్ స్వింగ్ అవుతున్నా కూడా వీర‌బాదుడు బాదుతున్నారు. టెస్ట్ మ్యాచ్ అయినా కూడా తొలి ప‌ది ఓవ‌ర్ల‌లో ర‌న్ రేట్ ఏకంగా 4 వ‌ర‌కు ఉంది. 10  ఓవ‌ర్ల‌కే భార‌త స్కోరు 40 దాటింది. ఓపెనర్ల‌లో రోహిత్ శ‌ర్మ 3 ఫోర్ల‌తో 21 ప‌రుగులు, శుభ‌మ‌న్ గిల్ 2 ఫోర్ల‌తో 19 ప‌రుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. కీవీస్ పేస్ బౌల‌ర్ల స్వింగ్ భార‌త ఓపెన‌ర్ల‌ను ఎంత మాత్రం ఇబ్బంది పెట్టలేదు. భార‌త ఓపెన‌ర్లు చాలా స్వేచ్ఛ‌గా ప‌రుగులు పారిస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్‌, టీ మ్ సౌథి భార‌త ఓపెన‌ర్ల‌ను పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: