రజాకార్ల వారసులు ఎంఐఎం నేతలు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఖాసీం రజ్వీ స్థాపించిన పార్టీనే మజ్లీస్ అని ఆయన విమర్శించారు. అదే మజ్లీస్ విమోచన దినం జరపకుండా అడ్డుకుంటోంది అన్నారు ఆయన. ఇక్కడ అక్బరుద్దీన్ నిర్మల్ లో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్బరుద్దీన్ అపవిత్రం చేసిన నిర్మల్ ను ఇవాళ బీజేపీ పవిత్రం చేస్తోంది అన్నారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆయన తెలిపారు. కుటుంబ అవినీతి, నియంత పాలనపై  ప్రజా ఆగ్రహంతో ఉన్నారు అని ఆరోపించిన ఆయన... హుజురాబాద్ లో ఈటెలను ఓడించేందుకు టిఆర్ ఎస్ అనేక కుట్రలు చేస్తోంది అని మండిపడ్డారు. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి గెలవాలని అనుకుంటోంది అని అన్నారు. హుజురాబాద్ లో ఈటెల ను గెలిపించుకుంటాం అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సంతకం చేస్తాం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts