తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకునేందుకు మరికొంత మందికి వీలు క‌ల్పించ‌నుంది.  న‌వంబ‌ర్ నుంచి ద‌ర్శ‌నం చేసుకునేందుకు రోజువారి టికెట్ల‌ను టీటీడీ పెంచ‌నుంది. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వేలాది మంది వ‌స్తుంటారు. ఇటీవ‌ల క‌రోనా కార‌ణంగా టికెట్ల‌ను త‌గ్గించ‌డంతో భ‌క్త‌లంద‌రికీ ద‌ర్శించుకునే భాగ్యం క‌లుగ‌లేదు. భ‌క్తుల‌కు త‌లెత్తుతున్న ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకొని వ‌చ్చే నెల‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నంకు సంబంధించిన టికెట్ల‌ను పెంచ‌నున్న‌ట్టు టీటీడీ అధికారులు ప్ర‌క‌టించారు.

రోజుకు 10వేలు స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు, 12వేలు ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల‌ను జారీ చేయ‌నున్న‌ట్టు తాజాగా టీటీడీ వెల్ల‌డించింది. టికెట్ల‌ను అక్టోబ‌ర్ 22 న ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్లు, 23 ఉద‌యం స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపింది. త్వ‌ర‌లో దీపావ‌ళి పండుగ రానున్న నేప‌థ్యంలో తిరుమ‌ల‌కు భ‌క్తుల ర‌ద్దీ పెరుగ‌నుంది. దీంతో టికెట్ల‌ను పెంచిన‌ట్టు అధికారులు పేర్కొంటున్నారు. పౌర్ష‌మి సంద‌ర్భంగా గ‌రుడ‌వాహ‌నం శ్రీ‌వారు విహ‌రించ‌డాన్ని, స్వామివారి వైభ‌వాన్ని భ‌క్తులు తిల‌కించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: