తెలంగాణ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల అన్నింటిలోకెల్లా అగ్రస్థానంలో ఉన్న‌ది ఉస్మానియా ఆసుప‌త్రి. ఇది నిజాం చివ‌రి రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఈ ఆసుప‌త్రిని నిర్మించారు. ఈ ఆసుప‌త్రికి ఎక్కువ‌గా  ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి పేద‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటారు.   పేద‌వారికి  ఒక సంజీవినిలా  ఈ ఆసుపత్రిలో ప‌ని చేస్తుంది. కానీ ఇందులో ఉండే  సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.

 ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో సోమ‌వారం ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ విభాగంలో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్‌ పై  ఉన్న‌ట్టుండి పై నుంచి సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడింది. ఆమె తలకు గాయాలు అయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువుడిలా ఉండే ఈ ఉస్మానియా ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్స కోసం వచ్చిన రోగులు భయాందోళనకు గురవుతున్నారు.  ఎప్పడూ రోగులతో రద్దీగా ఉండే ఉస్మానియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జ‌రిగితే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు.  డాక్ట‌ర్ల‌కే ఇలా జ‌రిగితే.. మ‌రీ పేషెంట్ల ప‌రిస్థితి అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: