భార‌త్ - న్యూజిలాండ్ మ‌ధ్య ముంబైలో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ బౌల‌ర్ మాయాజాలం సృష్టించారు. 10 వికెట్లు తీసి  అజాజ్ ప‌టేల్ ప్ర‌పంచ రికార్డును నెల‌కొలిపాడు. కివీస్ బౌల‌ర్ దెబ్బ‌కు భార‌త బ్యాట్స్‌మెన్ లు అంద‌రూ రాణించ‌లేక వికెట్ స‌మ‌ర్పించుకున్నారు. 1956లో తొలిసారిగా   జిమ్ లేక‌ర్ ఇంగ్లాండు కు బౌల‌ర్  10 వికెట్ల‌ను తీసారు. అదేవిధంగా పాకిస్తాన్‌తో ఒకే ఇన్నింగ్‌లో భార‌త బౌల‌ర్ అనీల్ కుంబ్లే 10 వికెట్ల‌ను తీసారు.  ఆ త‌రువాత ప్ర‌స్తుతం న్యూజిలాండ్ బౌల‌ర్ అజాజ్ ప‌టేల్ 10 వికెట్లు తీసిన మూడో బౌల‌ర్ గా చ‌రిత్ర‌లో నిలిచాడు.

ఒకే ఇన్నింగ్‌లో 10 వికెట్లు తీసి రికార్డును నెల‌కొలిపాడు. ముంబైలో జ‌రిగే రెండ‌వ టెస్ట్‌లో భార‌త జ‌ట్టు 325 ప‌రుగులు చేసింది. కివీస్ స్పిన్న‌ర్ ధాటికి ఎక్కువ ప‌రుగులు చేయ‌లేక‌పోయిన‌ది భార‌త జ‌ట్టు.  మొత్తం 47.5 ఓవర్ల పాటు అజాజ్ బౌలింగ్ చేశాడు.  అయితే 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లను  తీసాడు. 10 వికెట్లు తీసిన  కివీస్ స్పిన్న‌ర్  అజాజ్ ప‌టేల్ ను ప‌లువురు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: