వాషింగ్టన్‌లోని వైట్ హౌస్.. ఇది అమెరికా అధ్యక్షుడి భవనం.. దీని చుట్టూ ఎంత రక్షణ వలయం ఉంటుందో తెలిసిందే. అలాంటి కీలకమైన ప్రాంతంలో ఇద్దరు ఆకస్మికంగా మరణించడం కలకలం రేపింది. అయితే.. వైట్ హౌస్ సమీపంలో పిడుగు పడటమే వీరి మృతికి కారణంగా తెలుస్తోంది. వైట్ హౌస్ వద్ద పిడుగు పడిన ప్రమాదంలో ఇద్దరి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయని తెలుస్తోంది. వాషింగ్టన్‌ లోని అమెరికా అధ్యక్ష కార్యాలయం వెలుపల పిడుగు పాటుకు ఇద్దరు దుర్మరణం పాలవడం కలకలం రేపింది.


వైట్ హౌస్ ఎదురుగా ఉన్న లఫాయెట్‌ పార్క్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఏడు గంటల సమయంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల వద్ద పిడుగు పడింది. వీరిలో ఒక మహిళ, పురుషుడు మరణించారు. మరో మహిళ, పురుషుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  పిడుగు పాటు శబ్దంతో అక్కడకు చేరుకున్న సీక్రెట్‌ సర్వీస్‌, యూఎస్‌ పార్క్‌ పోలీసులు అత్యవసర సేవల విభాగం సిబ్బందికి సమాచారం అందించారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఎందుకైనా మంచిదని.. పార్క్‌లో కొంత భాగాన్ని అధికారులు మూసి వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: