భారత్‌, అమెరికాలకు చైనా బిగ్ షాక్ ఇచ్చింది. జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు అబ్దుల్ రౌఫ్‌ అజార్‌  పై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించే అంశాన్ని ఐక్య రాజ్య సమితిలో అడ్డుకుని తన తీరు మారలేదని నిరూపించుకుంది.  అబ్దుల్ రౌఫ్‌ అజార్‌ పై ఆంక్షలు విధించేందుకు అమెరికా, భారత్‌ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.


అబ్దుల్ రౌఫ్‌ అజార్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని భారత్, అమెరికా యత్నించాయి. అతడి ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్‌ కోరుతున్నాయి. ఈ మేరకు ఐరాసలో ప్రతిపాదన పెట్టాయి. ఐరాస భద్రతా మండలిలో 15 సభ్య దేశాల్లో 14 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించినా ఒక్క చైనా  మాత్రం దీన్ని ఆపేసింది. చైనా ఈ ప్రతిపాదనను హోల్డ్‌ లో పెట్టడం వల్ల అబ్దుల్ రౌఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఆలస్యం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: