రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చైనాలోని వుహాన్ లో మొదలై ప్రపంచదేశాలను గజగజా వణికిస్తున్న ఈ వైరస్ భారీన పడి ఇప్పటికే 3,100 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య 90,000 దాటింది. భారత్ లో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య, అనుమానితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 
 
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటూ ఉండగా ఒక స్టార్టప్ కంపెనీ మార్కెట్లోకి కరోనాకు పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇన్సూర్‌టెక్ స్టార్టప్ డిజిట్ ఇన్సూరెన్స్ 299 రూపాయల నుండి ప్రారంభమయ్యే కరోనా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ కంపెనీలో 25,000 రూపాయల నుండి 2,00,000 రూపాయల వరకు బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. 
 
టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలితే కంపెనీ నుండి 100 శాతం ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు. కంపెనీ కరోనా వైరస్ అనుమానిత కేసులకు కూడా పాలసీ డబ్బుల్లో సగం చెలిస్తుంది. అనుమానం ఉన్న వ్యక్తులను ఒకే చోట ఉంచి కంపెనీ సగం డబ్బుచెల్లిస్తుంది. కంపెనీ ఛైర్మన్ కామేష్ గోయల్ మాట్లాడుతూ వైరస్ వేగంగా విస్తరిస్తోందని ప్రతి ఒక్కరికీ ఈ పాలసీ అవసరం అని చెప్పారు. 2016లో డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రారంభమైంది. కెనడా కంపెనీ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్ డిజిట్ ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్‌మెంట్లు కలిగి ఉంది. ఈ కంపెనీ గ్లోబల్ టాప్ 250 ఫిన్‌టెక్ స్టార్టప్స్‌ లో స్థానం పొందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: