మ‌న‌కు ఏదైనా అవ‌స‌రం వ‌స్తే ఇమీడియెట్‌గా లోన్ కావాలంటే గుర్తుకొచ్చేవి బ్యాంకులు మాత్రమే. చిన్న అవ‌స‌రాల నుంచి పెళ్లి లాంటి శుభకార్యాలు దాకా డ‌బ్బుల కోసం బ్యాంకులు పర్సనల్ లోన్ ఇస్తాయి. దీంతో పాటుగా కొత్త ఇల్లు కొనుక్కోవాల‌న్న హోమ్ లోన్ పేరుతో బ్యాంకలు లోన్లు ఇస్తున్నాయి. అయితే మ‌రి వీటికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.కాక‌పోతే వీటిని పొందాలంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే వ‌స్తాయి.

అస‌లు సిబిల్ అంటే ఏంటంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అనే మీనింగ్ వ‌స్తుంది. లోన్ కావాల‌నుకునే మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు దీన్ని ఉపయోగిస్తారు. లోన్ తీసుకునే వ్య‌క్తి తాను గతంలో తీసుకున్న రుణాలను స‌క్ర‌మంగా తిరిగి చెల్లించిన తీరును ఇందులో ఉంచుతారు. అలాగే తీసుకున్న రుణాలను తిరిగి ఇన్‌టైమ్‌లో చెల్లించారా లేదా అన్న‌ది ఇందులో క్లియ‌ర్‌గా ఉంటుంది. అంతే కాదు మీరు ఎవ‌రికైనా ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందా అనే విష‌యాల‌పై ఇందులో చూస్తారు.

సిబిల్ స్కోరు అనేది మీ క్రెడిట్ చరిత్రను చాలా స్ప‌ష్టంగా తెలుపుతుంది. లోన్ల కోసం అప్లై చేసుకున్నప్పుడు రుణదాత వీట‌న్నింటినీ ప‌రిశీలించి ఆమోదం తెలిపాల్సిన అవ‌స‌రం ఉంటుంది. సిబిల్ స్కోర్ లో మీరు ఉండాల్సిన స్కోరు మినిమం 300 కాగా అత్యదిక స్కోర్ 900గా ఉంటుంద‌ని రికార్డులు చెబుతున్నాయి. మీకు ఎంత స్కోర్ ఎక్కువ ఉంటే మీరు రుణం పొందే అవకాశాలు ఉంటాయ‌ని అర్థం. ఒక‌వేళ తక్కువ స్కోర్ వస్తే లోన్ అప్లికేష‌న్ రిజెక్ట్ అయ్యే చాన్స్ ఉంటుంది.

వ్య‌క్తిగ‌త రుణాల కోంస దరఖాస్తు చేసుకున్నప్పుడు బజాజ్ ఫిన్‌సర్వ్ వెల్లడించిన వివరాల కొన్ని రూల్స్ ఉంటాయి. దీని ప్రకారం 720 నుంచి 750 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే కానీ పర్సనల్ లోన్ ఇవ్వ‌రు బ్యాంక‌ర్లు. అంతకంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే ఆ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది రికార్డులు చెబుతున్నారు. గృహ రుణం అకోసం క్రెడిట్ స్కోరు 750 కన్నా తక్కువగా ఉన్నా వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: