
మరి దీనికి కారణం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. రాజకీయాల్లో శాశ్వత శతృవులు.. శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు. ఈ క్రమంలోనే అవసరమైతే.. బీజేపీ నుంచి బయటకు వచ్చి.. పోటీ చేయాలని.. జన సేన నిర్ణయించుకున్నట్టు తరచుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలో టీడీపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారని కూడా చెబుతున్నారు. దీనిపై అనేక చర్చలు కూడా సాగాయి. అయితే.. తాజాగా పవన్ దీనిపైనా చెప్పకనే ఒక విషయం చెప్పారు. నేను ఎవరికోపల్లకీలు మేసేందుకు రాలేదన్నారు. అంటే.. దీనిని బట్టి.. టీడీపీతో పొత్తు ఉండదని ఆయన చెప్పినట్టు అనుకోవాలి.
ముఖ్యంగా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం.. తాను పార్టీ పెట్టాననే.. అపవాదును.. ప్రచా రాన్ని తుడిచేసుకునేందుకు పవన్ ఇలా వ్యాఖ్యానించి ఉంటాడని అనుకోవాలి. అయితే.. దీనివెనుక.. కొందరు... ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా మారుతున్నాయని అంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ సర్కారు.. ఇప్పటి వరకు టీడీపీకి బద్ధవ్యతిరేకి. అదేసమయంలో వైసీపీకి.. మిత్ర పార్టీగా చలామణిలో ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి కేసీఆర్, టీఆర్ ఎస్‌లు పరోక్షంగా పనిచేశాయి.
అయితే..జల వివాదాలు, విద్యుత్ బకాయిలు.. ఉద్యోగుల విభజన, ప్రాజెక్టుల నిర్మాణాలు వంటి కీలక విషయాల్లో.. కేసీఆర్ విభేదిస్తున్నారు. ఇదే.. ఇద్దరు సీఎంల మధ్య గ్యాప్‌కు కూడా కారణమైంది. ఏపీలో సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో ఇప్పటికీ... సెంటిమెంటు రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి.. ఈ సమస్యల విషయంలో పట్టుదలగానే కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను సైతం ఆయన పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారని.. మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అయితే.. కథ ఇక్కడితో అయిపోలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అటు బీజేపీని వదిలేసి.. ఇటు టీడీపీని నెత్తిన పెట్టుకోకుండా.. ఉంటే.. పవన్‌కు తాము సాయం చేస్తామని.. కేసీఆర్ ఆఫర్ ఇచ్చినట్టుగా.. తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది. దీనికి పవన్ ఔనన్నారా? కాదన్నారా? అనే విషయం తేలకపోయినా.. తాజాగా.. టీడీపీకి కూడాతాము దూరం.. అనే సంకేతాలను పవన్ పంపించారం టే.. దీనివెనుక కేసీఆర్ వ్యూహం ఉండి ఉంటుందని.. పరిశీలకులు సైతం చెబుతున్నారు.
కేసీఆర్ సాయం ఉంటే.. అధికారంలోకకి వచ్చేందుకు అవకాశం మెండుగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. సో.. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగినా.. ఆశ్చర్య పోవాల్సిన వఅవసరం లేదని అంటున్నారు. కేసీఆర్‌కు ఇప్పటికిప్పుడు.. జగన్ ప్రభుత్వం మార్చేయాలని ఉన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.