హుజురాబాద్ ఉపఎన్నికల కౌంటింగ్‌ ఇవాళ జరగబోతోంది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడబోతోంది. అయితే.. హోరాహోరీగా కొన్ని నెలల పాటు సాగిన ఈ ప్రచారం.. ఆ తర్వాత ఎన్నికల ఎత్తులు, పైఎత్తుల్లో కేసీఆర్, ఈటల వర్గాలు రెండు తమ శాయశక్తులా విజయం కోసం ప్రయత్నించాయి. అయితే.. విజయం ఎప్పుడూ కేవలం ఒక్కరినే వరిస్తుంది..  ఆ విజేత ఈసారి ఈటల రాజేందరే అంటున్నాయి అన్ని సర్వేలు. క్షేత్ర స్థాయిలో పర్యటించిన వారు కూడా ఈటల విజయం ఖాయమని చెబుతున్నారు.


ఒక వేళ ఈ సర్వేలు చెప్పిందే నిజమైతే.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్‌పై ఈటల రాజేందర్‌ విజయం సాధిస్తే మాత్రం.. అప్పుడు ఈటలను ఆడు మగాడ్రా బుజ్జీ అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే.. ఉపఎన్నికల్లో సహజంగానే అధికార పార్టీ వైపు మాత్రమే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునే అవకాశాలు అధికార పార్టీకి ఎక్కువగా ఉంటాయి. అందులోనూ అధికార పార్టీని కాదని.. జనం కూడా ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తే.. ఇప్పుడు వస్తున్న పథకాలు వస్తాయో రావో అన్న ఆందోళన కూడా ఉంటుంది.


ఇక ఈటల విషయానికి వస్తే.. హుజూరాబాద్‌లో గెలుపును కేసీఆర్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హుజూరాబాద్ లో గెలుపు కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. ఏకంగా ఒక్కో ఇంటికి రూ. 10 లక్షల రూపాయల లబ్ది చేకూర్చే దళిత బంధు పథకాన్ని కూడా ముందుగా హుజూరాబాద్ ఎన్నికల కోసమే అప్పటికప్పుడు తెచ్చారన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్టుగానే హుజూరాబాద్‌ నుంచే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.


ఇంకా కేసీఆర్‌..తన తురుపు ముక్క హరీశ్ రావును కూడా ఈటలపై ప్రయోగించారు. అంగ బలం, అర్థబలం, అధికార బలం.. ఇలా అన్నింటినీ కేసీఆర్ ఉపయోగించినా కూడా ఈటల రాజేందర్‌ గెలిస్తే.. నిజంగానే ఈటలను ఆడు మగాడ్రా బుజ్జీ అనొచ్చు. ఇక ఈటల బంపర్ మెజారిటీతో గెలిస్తే .. ఆ ఊపులో భవిష్యత్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: