సాధారణంగా ప్రతి ఒక్కరు ఎంతో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి అని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో జనాలు మాత్రం పోషకాలతో కూడిన ఆహారం కాకుండా మసాలాలు దట్టించిన జంక్ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే కాయగూరలు మాత్రమే కాకుండా ఆకు కూరలు తినడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది అని చెబుతుంటారు నిపుణులు  ఆకుకూరల్లో కాయగూరల తో పోల్చి చూస్తే ఎక్కువ విటమిన్లు ప్రొటీన్లు ఉంటాయి అని సూచిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పాలకూర అటు ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు నిపుణులు.



 ఈ క్రమంలోనే కొంతమంది అయిష్టంగా అనిపించినప్పటికీ పాల కూర తిని కాస్త పోషకాలను సంపాదించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు   అయితే మగవారితో పోల్చి చూస్తే అటు ఆడవారికి ప్రత్యేకమైన ఆహారం ఎంతైనా అవసరం  వారి శరీర పనితీరు సక్రమంగా జరగాలంటే తప్పనిసరిగా కావలసిన అన్ని పోషకాలు అందాల్సి ఉంది.  లేదంటే శరీర పని తీరులో కూడా మార్పు వస్తూ ఉంటుంది  అయితే పాల కూర తినడం అందరికీ మంచిది అని సూచిస్తూ ఉంటారు నిపుణులు. కానీ ముఖ్యంగా మహిళలు పాలకూర తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అని చెబుతున్నారు.



 సాధారణంగా చాలా మంది మహిళలు పాలకూర చూడగానే చిరాకు పడుతూ వుంటారు. అయిష్టం  వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇష్టం లేకపోయినప్పటికీ మహిళలు పాలకూర తినాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర లోని మెగ్నీషియం అటు మహిళలకు దృఢంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు.  ఇక పాలకూరను ఎక్కువగా తినడం వల్ల ఆడవాళ్లలో ఫ్రీ మెన్స్ స్ట్రుల్ సిండ్రోమ్ను అడ్డుకుంటుంది అని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు ఆడవాళ్ళలో ఎముకల పటుత్వానికి రక్త పోటు తగ్గడానికి కూడా పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. అందుకే మగవారితో పోల్చి చూస్తే అటు ఆడవారు పాలకూర తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: