ప్రపంచాన్ని కరోనా మానియా పట్టి పీడిస్తోంది. అవును. కరోనా వైరస్ దెబ్బకు చైనా కుదేలు మంది. అయితే కరోనా వ్యాప్తికి అసలు కారణం వారి ఆహారపు అలవాట్లేనని అందరికి తెలిసినదేకదా. మన ఇండియాలో చైనా ఫుడ్ అంటే కేవలం నూడుల్స్, ప్రైడ్ రైస్ అని మాత్రమే మనం అనుకుంటాం. కానీ, చైనాకి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేయవలసొచ్చినపుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. లేకపోతే, మీకు వంపుల వేపుడు, చీమల చట్నీ, పాముల ఫలావు పెట్టేస్తారు.. జాగ్రత్త!  చైనా ప్రజలు చీమ నుంచి పాము వరకు ప్రతి ఒక్కటీ రుచితో పనిలేకుండా తినేస్తారు. కొందరైతే పచ్చి మాంసాన్ని కూడా తినేస్తారు. 

 

అక్కడి ప్రజలు ఇష్టంగా తినే కొన్ని జగుప్సాకరమైన ఆహారాలను ఒకసారి తిలకిద్దాం. చిల్లీ చికెన్ తరహాలో.. ‘చిల్లీ రాబిట్ హెడ్’ వంటకం అక్కడ బాగా ఫేమస్. చైనాలోని సిచుహాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలో ఇది ఎక్కువగా లభిస్తుంది. గాన్సు ప్రావిన్స్‌లోని లాంజువాలో పావురాలను నూనెలో వేయించుకుని తింటారు. అలాగే, ఒక గుడ్డు నెల రోజులు నిల్వ ఉంటేనే బయటపడేస్తాం మనం. అలాంటిది చైనాలో వెయ్యేళ్ల నాటి గుడ్లను కూడా తినేస్తారు. దాన్ని బాగా ఉడకబెట్టి, ఉప్పు చల్లి అందిస్తారట. జెల్లీలా సాగుతూ భలే టేస్టీగా ఉంటుందని ఆహార ప్రియులు చెబుతున్నారు. 

 

బీజింగ్‌లోని వాంగ్‌ఫుజింగ్ రోడ్‌లో ఏర్పాటు చేసే నైట్ మార్కెట్‌లో ఏ కీటకం కనిపించినా నూనెలో వేసి ఫ్రై చేసేస్తారు. తేళ్లు, బొద్దింకలు, పురుగులను దోరగా వేయించి, పుల్లలకు గుచ్చి ఇస్తారు. చైనీయులు తేనెటీగలను కూడా వదిలిపెట్టరు. వారికి తేనె తుట్ట కంటే.. దాన్ని తయారు చేసే తేనెటీగలు అంటేనే ఇష్టం. బీజింగ్ నైట్ మార్కెట్లో వాటిని నూనెలా వేయించి స్నాక్స్‌లా అందిస్తారు. పాములను చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. అయితే, చైనా ప్రజలకు మాత్రం పామును చూడగానే నోరూరుతుంది. అదిగానీ చేతికి చిక్కితే.. కోసేసి నూనెలో వేపుకుని తేనేస్తారు. లేదా సూప్ తయారు చేసుకుని వేడి వేడిగా తాగేస్తారు. 

 

పాము వంటకాల కోసం ఏకంగా అక్కడ ‘స్నేక్ రెస్టారెంట్లు’ వెలిశాయి. చైనాలో కుక్కలను కోసుకుని తినేస్తారు. మటన్ తరహాలో విభిన్న వంటకాలు తయారు చేస్తారు. కాబట్టి, ఎప్పుడైనా చైనాకు వెళ్లి మటన్ ఆర్డర్ చేస్తే.. ఒకసారి ఆలోచించండి. ఇండియాలో కూడా కొన్ని రెస్టారెంట్లలో కుక్కలను మటన్‌గా అమ్మేస్తున్న వార్తలు గతంలో వచ్చాయి. కాబట్టి.. వీలైనంత వరకు ఫుడ్ స్టాళ్లలో మటన్ వంటకాలు తినకపోవడమే బెటర్. పక్షినే కాదు, పక్షి లాలాజలాన్ని కూడా చైనీయులు వదిలిపెట్టరు. పక్షి నోటి నుంచి వచ్చే లాలాజలాన్ని బాగా ఎండబెట్టి సూప్‌ తయారు చేస్తారు. 

 

‘షేప్ ఫర్ షేప్.. లైక్ ఫర్ లైక్’ అనేది చైనీయులు విశ్వసిస్తారని, మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే వేరే జంతువు మెదడును, కాళ్లు బలంగా ఉండాలంటే జంతువుల కాళ్లను తింటారని పేర్కొన్నాడు. ‘‘చైనాలో జీవిస్తున్న 1.4 బిలియన్ ప్రజల్లో కేవలం కొద్దిమంది మాత్రమే ఇలాంటి ఆహారాన్ని తింటారు. గబ్బిలం, కోతులు తదితరాలను ధనవంతులు మాత్రమే తింటారు. చాలామంది చైనీయులు ఆకు కూరలు, చెట్ల వేళ్లు తిని జీవిస్తుంటారు. కాబట్టి, చైనీయులంతా క్రూరమైన ఆహార ప్రియులని భావించవద్దు’’ అని ప్రముఖ చైనా నిపుణుడు వాంగ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: