కడుపునొప్పి అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ కడుపు నొప్పి వల్ల కడుపులో తిప్పివేసినట్టు, మెలి పెట్టినట్టు జరుగుతూ ఉంటుంది. ఫలితంగా తీవ్రమైన బాధకు గురి అయ్యి,ఎంతో మంది భరించలేని నొప్పికి గురి అవుతూ ఉంటారు. ఈ కడుపు నొప్పిని సాధారణంగా పొత్తికడుపు, తొడగజ్జె కు మధ్య  భాగంలో వచ్చే నొప్పిని కడుపు నొప్పిగా సూచిస్తాము. ముఖ్యంగా ఈ కడుపునొప్పి నీరు తిత్తి, పిత్తాశయం, పేగు,ప్రత్యుత్పత్తి అవయవాలు, మూత్రాశయం వంటి అనేక అవయవాలను కలిగి ఉంటుంది.  కడుపులోని ఏ భాగానికైనా గాయం, పుండ్లు,వాపు ఏర్పడడం వల్ల ఈ  కడుపు నొప్పి సంభవిస్తుంది.

సాధారణంగా కడుపు నొప్పి స్వల్పకాలికమైనదే కానీ తీవ్రమైనదేమీ కాదు.అయితే కొన్నిసార్లు ఇది తీవ్రమైన పరిస్థితిని తెచ్చిపెడుతుంది.  కడుపు నొప్పి తీవ్రత, ఆ నొప్పికి  దారితీసే కారణాలపై ఆధారపడి ఉంటుంది. కడుపు నొప్పి సాధారణంగా టాబ్లెట్స్ లేదా విశ్రాంతితో పాటు స్వీయసంరక్షణతోనే నయమవుతుంది. చాలాసార్లు అజీర్తి,అతిసారం వంటి సమస్యలతో ఇది ఏర్పడుతుంది. చాలా అరుదైన సమయాల్లో మాత్రమే శస్త్ర చికిత్సకు దారి తీస్తుంది. అయితే నొప్పి తీవ్రత మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం కోసం కొన్ని చిట్కాలను ఉపయోగించి, కడుపు నొప్పి బాధ నుంచి బయటపడవచ్చు.


అలోవెరా జ్యూస్:
అలోవెరా జ్యూస్ ను తీసుకోవడం వల్ల అనేక రకాలైన పొట్ట,ప్రేగు సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.అంతే కాకుండా కడుపు ఉబ్బరం,గ్యాస్ లాంటి సమస్యల నుంచి బయటపడాలంటే అలోవెరా జ్యూస్ మంచి ఔషధం.

బేకింగ్ సోడా:
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడాను వేసి బాగా మిక్స్ చేసి,తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి బయటపడవచ్చు.

అల్లం:
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అల్లం ను టీ లాగ చేసుకొని తాగడం వల్ల త్వరిత ఉపశమనం కలుగుతుంది.

నిమ్మరసం:
గోరువెచ్చటి నీటిలో కొద్దిగ నిమ్మరసం, తేనె, ఉప్పు కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి బయటపడవచ్చు.

పుదీనా:
పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి,నోట్లో వేసుకొని నమిలి మింగడం లేదా పుదీనా ఆకులను వేసి టీ తయారు చేసుకొని తాగడం లాంటివి  చేయడం వల్ల కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: