గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మే 16వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1532: థామస్ మోర్, ఇంగ్లాండ్ లార్డ్ చాన్సలర్ (కులపతి) పదవికి రాజీనామా చేసాడు.
1763: ఆంగ్ల నిఘంటు నిర్మాత, రచయిత శామ్యూల్ జాన్సన్ , మొదటి సారిగా, భవిష్యత్తులో తన జీవితచరిత్ర, ను రాయబొయే, జేమ్స్ బోస్వెల్ ని, కలుసుకున్నాడు. తన మరణానంతరం, తన జీవిత చరిత్రను వ్రాసేవాడు బోస్వెల్ అని జాన్సన్ కి తెలియదు.
1770 : మారియే ఆంటోయినెట్టే, తన 14 వ ఏట, భవిష్యత్తులో ఫ్రాన్సుదేశనికి రాజు కాబొయే, లూయిస్ 16 ని, అతని 15వ ఏట పెళ్ళి చేసుకుంది.
1801: విలియం సెవార్డ్ , (రాష్ట్ర కార్యదర్శి) సెక్రటరీ అఫ్ స్టేట్ (అమెరికా), రష్యా నుండి అలస్కా ను 1867 లో 7.2 మిలియన్ డాలర్లకు కొన్నాడు. ఆ రోజుల్లోని, అమెరికా ప్రజలంతా, సెవార్డ్ పిచ్చి పనులు అనేవారు. యుద్ధతంత్ర రీత్యా,, అలాస్కా ప్రాముఖ్యత ఏమిటో నేటి అమెరిక ప్రజలకు తెలుసు.
1804: ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తి ప్రకటించింది.
1824: లెవి పార్సన్స్ మోర్టన్ (జ. 1824 మే 16 – మ. 1920 మే 16), అమెరికా దేశపు 22వ ఉపాధ్యక్షుడుగా (1889 నుంచి 1893 వరకు) పుట్టాడు. బెంజమిన్ హారిసన్, 23వ అమెరికా అధ్యక్షుడి కింద ఉపాద్యక్షుడుగా పనిచేసాడు. మే 16వ తేదీన పుట్టి, మే 16వ తేదీనే మరణీంచాడు.
1831: మైక్రోఫోన్ సృష్టికర్త డేవిడ్ హ్యుస్, పుట్టాడు.
1881: మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజలకు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.
1929: మొదటి అకాడమీ అవార్డులు, హాలీవుడ్ దగ్గర ఉన్న రూజ్వెల్ట్ హోటల్ లో ఒక విందు సమయంలో బహూకరించారు. వింగ్స్ సినిమా ఉత్తమచత్రం, ఎమిల్ జన్నింగ్స్ ఉత్తమ నటుడు, జానెట్ గేనర్ ఉత్తమ నటి.
1969: మానవరహిత సోవియట్ అంతరిక్ష నౌక వీనస్-5, శుక్రగ్రహం ఉపరితలంపై అడుగుపెట్టింది.
1975: జాపనీస్ పర్వతరోహిణి, జుంకే తాబెయ్, మౌంట్ ఎవరెస్టు శిఖరం చేరిన మొదటి మహిళ.
1992: స్పేస్ షటిల్ ఎండీవర్ తన మొదటి రోదసీ ప్రయాణం, సుఖంగా ప్రయాణించి, తిరిగి, కాలిఫోర్నియా ఎడారిలో సురక్షితంగా దిగింది..
1996: భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.
1997: రష్యా యొక్క "మీర్" రోదసీ స్టేషనుతో అమెరికాకు చెందిన అట్లాంటిస్ స్పేస్ షటిల్ జతగా కలిసాయి. (డాకింగ్ అయ్యాయి) "
2006: భారతదేశం అగ్ని-III బాలిస్టిక్ క్షిపణి యొక్క ప్రయోగ పరీక్షను, వాయిదా వేసింది.
2007: ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.
2007: లావోస్ లో భూకంపం రెక్టర్ స్కేల్ పై 6.3 ప్రమాణంతో వచ్చింది.

ప్ర‌ముఖుల జననాలు...

1923: డా. లింగం సూర్యనారాయణ, శస్త్రచికిత్స నిపుణులు.
1960: సుద్దాల అశోక్ తేజ, సినీ గేయ రచయిత.
1978: సొమా బిశ్వాస్, భారత అథ్లెటిక్స్ క్రీడాకారిణి.

ప్ర‌ముఖుల మరణాలు

1830: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (జ.1768)
1908: దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు
1950: పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (జ.1914)
1999: మారొజు వీరన్న, బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (బీడీఎస్ఎఫ్‌) స్థాపకుడు.
2018: దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1931)

మరింత సమాచారం తెలుసుకోండి: