సాధారణంగా శీతాకాలం వచ్చింది అంటే ప్రతి ఒక్కరు భయపడతారు.. కారణం చలి.. ఈ చలి కారణంగా చర్మంపై దద్దుర్లు రావడం, చర్మం పొడిబారిపోవడం, జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి లాంటి ఎన్నో సమస్యలు బాధిస్తాయి అందుకే శీతాకాలంలో మనం సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యల నుంచి అయినా బయటపడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే శీతాకాలంలో వచ్చే సమస్యల నుంచి దూరం కావాలి అంటే ఒకే ఒక్కటి చౌకైనా మెడిసిన్ జామ ఆకులు అని చెప్పవచ్చు. పది ఆపిల్స్ తో సమానమైన ఒక్క జామపండు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో అంతకంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను జామ ఆకులు అందిస్తాయి.

జామ ఆకులు మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తాయి. మొటిమల సమస్యలతో బాధపడేవారు జామ ఆకులను మెత్తగా నూరి వాటి పేస్టును మొటిమలపై లేపనంగా వేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన మొటిమలు తగ్గుముఖం పడుతాయి.జామ ఆకుల లో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్  ఉంది. ఇది క్యాన్సర్ సంభావ్యతాను తగ్గిస్తుంది. కాబట్టి క్యాన్సర్ ఉన్నవారు ప్రతి రోజు ఈ జామ ఆకుల టీ ని ప్రతి రోజు త్రాగడం వలన మంచి ఫలితం వస్తుంది.

శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను నయం చేసుకోవాలి అంటే జామ ఆకులతో తయారు చేసిన కషాయం తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా జామ ఆకులతో చేసే టీ వీటికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. విటమిన్ సి , ఫైబర్ , పొటాషియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి మన శరీరం త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటుంది. అలాగే దగ్గు, అజీర్తి, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు కూడా జామ ఆకులతో తయారుచేసిన టీ తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: