
విడుదలకు ముందే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో "అతడు" 4K రీరిలీజ్‌కి బుకింగ్స్ ఊహించని స్థాయిలో సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన కొన్ని కొత్త సినిమాల కంటే ఎక్కువ స్క్రీన్లు "అతడు"కు దక్కాయి. ఇది మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి సాక్ష్యం! ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ మల్టిప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లు అన్నీ హౌస్‌ఫుల్ బోర్డుల దిశగా వెళ్తున్నాయి. ఘట్టమనేని ఫ్యాన్స్ మళ్లీ పార్థుగా మహేష్‌ని పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ ట్రేడ్ టాక్ ప్రకారం, 4K రీమాస్టర్ థియేట్రికల్ రైట్స్ రూ. 3 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి.
నైజాంలో ఈ సినిమాను ఏషియన్ సునిల్ భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఏపీ లోని ముఖ్యమైన ఏరియాల కోసం టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చారు. ఈ సినిమాకు బర్త్‌డే స్పెషల్ హైప్, వీకెండ్ ఓపెనింగ్, కొత్త సినిమాల తక్కువ సమర్పణ – అన్నీ కలిసి "అతడు" రీరిలీజ్‌ను రికార్డ్ స్థాయిలో నిలబెట్టే అవకాశముంది. ‘అతడు’ లో మహేష్ డైలాగ్ డెలివరీ, ఇంటెన్సిటీ, ఎమోషనల్ డెప్త్ అన్నీ కలిపి ఇప్పటికీ రీపీట్ వాచ్ వాల్యూలో టాప్‌లో ఉంటాయి. పార్థుడిగా ఆయన శైలి ఈ జనరేషన్‌కి కూడా ఇన్‌స్పిరేషన్ అవుతుందనడంలో సందేహం లేదు.