తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను బీఆర్ఎస్ "జాతిపిత"గా కీర్తిస్తుంది. ఆయన అభిమానులు “బాపూ” అంటూ అయ‌న పై అభిమ‌నం చూపిస్తారు. కానీ ఇదే బాపూకి తన ముద్దుల తనయ కవిత తిరగబడితే ? ఇదే రాజకీయ వ్యత్యాసానికి నిదర్శనమంటున్నారు పౌరులు. కవిత రాజకీయ జీవితం ఎంతో మిశ్రమంగా సాగింది. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచి బీఆర్‌ఎస్ తరఫున ఢిల్లీకి వెళ్లిన ఆమె, 2019లో ఓడిపోయారు. అప్పట్నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నా, ఆమెపై కేసీఆర్ చూపిన ఆప్యాయతా, ప్రోత్సాహమూ ఏమాత్రం తగ్గలేదు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత ఆమెపై పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.


జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ నుంచి తనకు అండలు లేవని, కావాల్సిన మద్దతు అందలేదని కవిత భావించడం మొదలైంది. ఆమె మాటల్లోనూ, బాడీలోనూ ఎప్పుడో పుట్టిన అసంతృప్తి బాహాటంగా దూసుకొస్తోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రిని నేరుగా లక్ష్యంగా చేసుకొని “లిల్లిపుట్” అంటూ మాటల తూటాలు పేల్చిన విషయం వివాదాస్పదమైంది. ఇక వీటన్నింటికీ కీలక కారణం కవిత కొత్త పార్టీ గురించిన ప్రచారమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆమె పార్టీని బయటకు వెళ్లి ప్రారంభించాలని చూస్తున్నారని, కానీ బీఆర్ఎస్ నేతలు తొందరపడకుండా మౌనంగా చూసిపోతున్నారని చెబుతున్నారు. పార్టీ నుంచి బయటకు పంపిస్తే తనకు సానుభూతి వస్తుందన్నది కవిత వ్యూహం అని ప్రచారం సాగుతోంది.


“తండ్రిని లక్ష్యంగా కాకుండా... ఆయన చుట్టూ ఉన్న నేతలే ఇబ్బంది పెడుతున్నారని చూపించి… తానూ కేసీఆర్ వారసత్వానికి తగిన వ్యక్తినే అని నిరూపించుకునే ప్రయత్నం” చేస్తుందన్నది ఆమె వ్యూహం. కానీ బీఆర్ఎస్ లో రాజకీయ వ్యూహాలలో నిపుణులే ఉన్నారు. కవిత తానంతట తానే బయటకు వెళ్లేలా చేయాలని చూస్తున్నట్టు వర్గీయులు చెబుతున్నారు. మొత్తానికి… ఈ రాజకీయ డ్రామా ఎటు తిరుగుతుందో చెప్పలేరు. కవిత తండ్రినే టార్గెట్ చేయాలనుకుంటున్నదా ? లేక ఆయన వారసత్వం కోసం వెనుక నుంచి పోరాడుతుందా ? ఇది సాధారణ విష‌యం కాదు… ఇది సీనియర్ స్టైల్‌లో రూపొందుతున్న అసలు “పవర్ గేమ్”! చివరగా – తండ్రికి కత్తి చూపిస్తూ… వారసత్వపు సింహాసనం కోసం కూతురు అడుగు వేస్తుందా ? వేచి చూడాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: