సత్యదేవ్.. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయిన ఇండస్ట్రీలో సత్యదేవ్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కేవలం హీరో పాత్రలే చేస్తాను అని గిరి గీసుకోకుండా విలన్ గా, సహాయక నటుడుగా కూడా ప్రేక్షకుల‌ను అలరిస్తున్నారు. రీసెంట్ గా కింగ్డమ్ మూవీలో హీరో విజయ్ దేవరకొండకు అన్నయ్యగా అత్యంత ముఖ్యమైన పాత్రలో నటించి విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. త్వరలోనే `అరేబియన్ కడలి` అనే వెబ్ సిరీస్, `ఫుల్ బాటిల్‌` అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించ‌బోతున్నాడు.


అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్.. తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. కింగ్డ‌మ్‌ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం శారీరకంగా చాలా శ్రమ పడ్డామని.. తన పాత్ర చుట్టూ ఉండే ఎమోషన్ ను ప్రభావంతంగా పండించడం సవాలుగా అనిపించదని... అయితే ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక అప్పుడు పడ్డ కష్టం అంతా మర్చిపోయానని సత్యదేవ్ వివ‌రించాడు.


అలాగే కథలో ప్రాధాన్యత లేని పాత్రలు చేయ‌డం త‌న‌కు న‌చ్చ‌ద‌ని.. కాక‌పోతే ఎదుటి వాళ్ళని నొప్పించకుండా నో అనే మాట చెప్పడం కోసం చాలా కష్టపడుతుంటానని సత్యదేవ్ తెలిపాడు. `కేవలం డ‌బ్బు కోసమే సినిమాలు చేయాలనే టైప్ నేను కాదు.. ఒకవేళ డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చే వాడినైతే వెళ్లి పొలం పనులు చేసుకుంటా కానీ సినిమాలు చేయను` అంటూ సత్యదేవ్ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం వెంకటేష్ మహా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, `ఆరంభం` ఫేమ్‌ అజయ్ నాగ్ తో ఓ సినిమా చేస్తున్నాన‌ని.. మ‌రో రెండు చిత్రాల‌కు కూడా సైన్ చేశాన‌ని స‌త్య‌దేవ్ స్ప‌ష్టం చేశాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: