ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కొన్ని ప్రభుత్వాలు చేసే తప్పులను అస్సలు తప్పే కాదన్నట్టుగా  క్రియేట్ చేస్తూ ఒక వర్గం మీడియా ప్రవర్తిస్తోంది. మీడియా అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి కానీ, కొన్ని ప్రభుత్వాలకు సపోర్ట్ చేసి మరికొన్ని ప్రభుత్వాలకు  దూరంగా ఉంటే మంచిది కాదు. మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడు అని చెప్పాలి.. కానీ ఈ కేసులో మాత్రం అసలు వాళ్ళు చేసింది తప్పే కాదన్నట్టుగా  ఒక మీడియా వర్గం రాసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి వాళ్ళు ఏం రాశారు. వివరాలు చూద్దాం.. జగన్ టైమ్ లో తప్పు జరిగితే బ్యానర్ హెడ్డింగ్ వేస్తారు. బాబు హయాంలో తప్పు జరిగితే లోపలి పేజీల్లో అర్థం కాని, హెడ్డింగ్స్ తో కవర్ చేస్తారు. 

రాయకుంటే తప్పదు కదా అని ఏదో అంటీ  ముట్టనట్టుగా రాసుకోస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా.. తాజాగా నోటిఫై కానీ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చెల్లదంటూ  హైకోర్టు స్పష్టం చేసింది. అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసిన  15 కేసులను రద్దు చేసింది. వీటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ లను కూడా రద్దు చేసింది. ఆయా కేసులు నమోదు చేసే నాటికి విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ గా నోటిఫై చేయలేదని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదని పేర్కొంది. విజయవాడ ఏసిబిసిఐయులో నమోదైన  ఎఫ్ఐఆర్ కు చట్టబద్ధత ఉండదని పేర్కొంది. దీనిపై హైకోర్టు జస్టిస్ హరినాథ్ తీర్పు వెలువరించారు.

వివరాల్లోకి   వెళ్తే 2014లో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు. 2016 లో కూడా ఆయనే పాలనలో ఉన్నారు. సెంట్రల్ యూనిట్ అనేది పెట్టింది కూడా చంద్రబాబే. 2024 వరకు అది పోలీస్ స్టేషన్ గా  కన్ఫామ్ చేయలేదు. అదే సమయంలో చాలామంది నాయకులు వందలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు.. ఆ టైంలో అంత అనుభవం ఉన్నటువంటి ఆ నాయకుడు ఇంత అవినీతి జరిగిన ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది అందరి మెదల్లలో ఉన్న ప్రశ్న.. ఇదే జగన్ హయాంలో జరిగి ఉంటే బ్యానర్ హెడ్డింగ్ అయ్యేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. వారు చేస్తే తప్పు కాదు కానీ, జగన్ చేస్తే తప్పా అంటూ మాట్లాడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: