ఆఫ్రికా నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్తున్న శరణార్థులు ప్రయాణిస్తున్న పడవ యెమెన్ ప్రాంత తీరంలో వీరు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారుగా 68 మంది మరణించగా మరో 74 మంది గల్లంతయ్యారంటూ ఐక్యరాజ్య సంస్థ తెలియజేసింది... మొత్తం మీద ఈ పడవలో 154 మంది ప్రయాణించారని.. ఇందులో ప్రయాణించిన వారందరూ కూడా ఇథియోపియన్లు ఎక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే ఈ ప్రమాదం నిన్నటి రోజున తెల్లవారుజామున జరగడంతో ఆలస్యంగా బయటికి వచ్చింది.


యెమెన్ అభియాన్ ప్రావిన్స్ తీరానికి దగ్గరగా గల్ఫ్ ఆఫ్ ఆబియాన్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకున్నదట. ఈ సముద్రంలో మునిగిన పడవలో కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని ఇందులో ఒకరు యెమెన్ దేశస్థులు కాగా మిగిలిన వారందరూ కూడా ఇథియోపియన్లుగా తెలుస్తోంది. సముద్రంలో మరణించిన 54 మంది మృతి దేహాలు ఖన్ఫర్ జిల్లా తీరంలో లభించాయట. అలాగే మరో 14 మృతదేహాలు కూడా జంజీబార్ నగరంలో కనిపించడంతో వారిని ఆసుపత్రికి తరలించినట్లు అక్కడ అధికారులు తెలిపారు.

గల్లంతైన వారికోసం ప్రత్యేకించి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ సముద్రం మీద బలమైన అలల కారణం చేత ఈ గాలింపు చాలా కష్టంగా మారుతున్నదట... ఆఫ్రికాలోని హార్న్ ఆఫ్ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు చేరుకోవడానికి యెమెన్ చాలా కీలకమని కానీ ఇప్పుడు ఇది చాలా ప్రమాదకరమైన మార్గంగా మారిందట.. ఉపాధి, తిండి కోసమే వలసదారులు తరచూ ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వెళుతూ ఉండేవారు. నాణ్యతలేని పడవల కారణం చేత ఈ ప్రమాదాలలో చాలామంది ప్రాణ నష్టాలు కోల్పోతున్నట్లు అక్కడ ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఈ విషాదమైన సంఘటనకు ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోంది. మరి ఇక మీదట ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: