ఈ ఏడాది న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన `కోర్ట్` చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ జగదీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో యువ జంటగా హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి నటించారు. అలాగే ఇతర ముఖ్యమైన పాత్రల‌ను ప్రియదర్శి, శివాజీ, రోహిణి తదితరులు పోషించారు. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ పెద్ద విజయం సాధించింది. తొలి ఆట నుంచే విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకుంది.


అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్‌గా నటించిన రోషన్, శ్రీదేవిల‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమాకు `బ్యాండ్ మేళం` అనే ఫన్నీ టైటిల్ లో కూడా ఫిక్స్ చేశారని ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట.


కాగా, కోర్ట్‌లో జాబిల్లిగా న‌టించిన కాకినాడ శ్రీ‌దేవి స్వ‌స్థ‌లం కాకినాడ‌. ఇన్‌స్టాలో రీల్స్ ద్వారా ఫేమ‌స్ అయిన శ్రీ‌దేవి.. కోర్ట్ మూవీతో హీరోయిన్ గా మారింది. అంత‌క‌న్నా ముందు ప‌లు చిత్రాల్లో గుర్తింపులేని సైడ్ క్యారెక్ట‌ర్స్ ను పోషించింది. కోర్ట్‌తో మంచి గుర్తింపు రావ‌డంతో శ్రీ‌దేవికి ఆఫ‌ర్లు క్యూటీ క‌డుతున్నాయి. ఇటీవ‌లె ఒక సినిమాకు ఆమె సైన్ చేసింది. కోలీవుడ్‌ ప్రముఖ నిర్మాత‌ కేజీఆర్ హీరోగా చేస్తున్న రెండో సినిమాలో శ్రీ‌దేవి ఫీమెయిల్ లీడ్‌గా ఎంపిక అయింది. మ‌రోవైపు రోహ‌న్ కూడా సెల‌క్టివ్ గా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ కెరీర్ ను బిల్డ్ చేసుకున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: