తెలంగాణ రాష్ట్రం స్పోర్ట్స్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు దూకుడు చూపిస్తోంది. తాజాగా “తెలంగాణ క్రీడా విధానం 2025”లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. TS స్పోర్ట్స్ గవర్నింగ్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ పేరిట ప్రత్యేక పాలనా మండలిని ఏర్పాటు చేసింది. ఈ బోర్డు కేవలం పరిపాలనా బోర్డే కాదు … ఇది తెలంగాణ క్రీడల భవితవ్యాన్ని మార్చే ట్రాన్స్ఫార్మేషన్ బోర్డుగా అభివృద్ధి కానుంది. ఉపాసన – గ్లామర్ తో పాటు విజన్ కలిగిన నాయకత్వం! .. ఈ బోర్డుకు కో-చైర్‌పర్సన్‌గా అపోలో గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని నియమితమవ్వడం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. వ్యాపార రంగంతో పాటు సామాజిక బాధ్యత, యువతతో సంబంధాలు ఉన్న ఉపాసన – స్పోర్ట్స్ పాలసీకి కొత్త బలాన్ని ఇచ్చే నాయకురాలిగా అందరూ చూస్తున్నారు.


చైర్మన్‌గా సంజీవ్ గోయెంకా – బిజినెస్ బ్రెయిన్ స్పోర్ట్స్ వైపు! .. బోర్డుకు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త డా. సంజీవ్ గోయెంకా వ్యవహరించనున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యం నుండి స్పోర్ట్స్ మార్కెటింగ్ వరకు అనుభవం ఉన్న ఆయన నేతృత్వం, బోర్డును ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దేలా మారనుంది. లెజెండ్స్ అండ్ లీడర్స్ – ఒకే బోర్డులో! .. ఈ బోర్డులో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ శిక్షణ దిగ్గజం గోపీచంద్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా, ఫుట్‌బాల్ లెజెండ్ బైచుంగ్ భుటియా వంటి క్రీడారంగ నక్షత్రాలు సభ్యులుగా ఉండడం, ఈ బోర్డుకు ప్రాధాన్యతని పెంచుతోంది. వీరితో పాటు క్రీడా పారిశ్రామికవేత్త వితా దానీ, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ నిపుణురాలు కావ్య మారన్, పాలనారంగ నిపుణులు రవికాంత్ రెడ్డి మరియు బయ్యాల పాపారావు వంటి వారు ఈ బృందంలో చేరడం ఒక డ్రీమ్ టీమ్ లా మారింది.


ధ్యేయం – గ్రామీణ స్థాయి నుంచే గోల్డ్ మెడల్స్! .. ఈ బోర్డు లక్ష్యం రెండు పాయింట్ల చుట్టూ తిరుగుతుంది – ప్రతి రూపాయి ఖర్చు పూర్తిగా పారదర్శకంగా ఉండాలి ..  గ్రామీణ క్రీడాకారుడికీ సమాన అవకాశాలు అందాలి , అంటే… ఆటలు, క్రీడలు, ప్రతిభ, అవకాశాలు అన్నీ ఒక్కే లెవల్లో ఉండేలా చెయ్యటమే టార్గెట్! TS స్పోర్ట్స్ హబ్ – తెలంగాణ స్పోర్ట్స్ కు గేమ్ చేంజర్! .. ఈ బోర్డు కేవలం పాలన కోసమే కాదు – ఇది రాష్ట్రంలో స్పోర్ట్స్ మెకానిజాన్ని ఓ హబ్‌గా నిర్మించనుంది. ఆటగాళ్లకు కార్పొరేట్ మద్దతు, శిక్షణా సదుపాయాలు, స్పాన్సర్ నెట్‌వర్క్, కోచింగ్ అకాడమీ, ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ అన్నీ centralized గా కిందికి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వేసిన ఈ అడుగు రాష్ట్ర క్రీడారంగానికి ఒక సువర్ణయుగాన్ని తెస్తుందనే నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఒలింపిక్స్ లో తెలంగాణ గోల్డ్ మెడల్ సాధించడం కల కాదు – గమ్యం!

మరింత సమాచారం తెలుసుకోండి: