"కాంతార" – కేవలం ఓ సినిమా కాదు… ఇది భక్తి, భయం, భూమి అన్న మూడు శక్తుల పరాకాష్ఠగా నిలిచిపోయింది. రిషబ్ శెట్టి రూటెడ్ నాటివిటీతో పాటు మిస్టిక్ ఎలిమెంట్స్ కలిపి రూపొందించిన ఈ మూవీ కేవలం కన్నడ సినీప్రపంచానికే కాదు, దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల మనసుల్ని దోచుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న "కాంతార 2" పట్ల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ అసలు షాకింగ్ న్యూస్… కాంతార 3 గురించి వచ్చిన బజ్! ఎన్టీఆర్ - రిషబ్ శెట్టి కాంబో ఓన్ ఆన్ స్క్రీన్..? .. ఇన్ సైడ్ సమాచారం ప్రకారం, "కాంతార 3" కోసం రిషబ్ శెట్టి బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కీలక పాత్రను ఇవ్వాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఇటీవలే ఒక ప్రైవేట్ మీటింగ్ లో కలవడం, అక్కడే "కాంతార యూనివర్స్" గురించి చర్చలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ టైమ్, కమిట్‌మెంట్స్ అందుబాటులో ఉంటే "కాంతార 2"లోనే ఓ లీడ్ ఎలిమెంట్ ద్వారా ఆయన పాత్రను టీజింగ్ చేయాలన్న ఐడియా కూడ రిషబ్ గుండెల్లో ఉందట!


బాక్సాఫీస్ బ్లాస్టర్ గురజాడు! .. కాంతార అనే నేచురల్ మిస్టిక్ యూనివర్స్‌లో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో చేరితే ప్రేక్షకుల్లో క్రేజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవైపు రిషబ్ శెట్టి నేచురల్ ఫిల్మ్ మేకింగ్, మరోవైపు ఎన్టీఆర్ క్రేజ్‌ కలిస్తే, దానికి టిక్కెట్ పెట్టే బాక్సాఫీస్ లేదనేది ట్రేడ్‌ టాక్ ముందుగా ఓ చిత్రం – ఆ తరువాత కాంతార 3 .. అయితే "కాంతార 3" ఇప్పుడే మొదలవ్వదట. ఈ గ్యాప్ లో రిషబ్ శెట్టి మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమానికి దర్శకుడిగా అశ్విన్ గంగరాజు ఉండనున్నారు. ఈ సినిమా తర్వాతే "కాంతార 3" సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ ఈ గ్యాప్ టైమ్‌లో ఎన్టీఆర్ డేట్స్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ – అన్నీ ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.


కాంతార యూనివర్స్.. మల్టీ లాంగ్వేజ్ మాసివ్ యాక్షన్ మిస్టికల్ ఎక్స్‌పీరియన్స్ .. ఇప్పటిదాకా మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద బ్యానర్లు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ చూసిన విధంగా, "కాంతార 3" కూడా అలాంటి బడ్జెట్, స్థాయిలో రూపొందే అవకాశముంది. ఇక ఎన్టీఆర్రిషబ్ ఇద్దరూ నటనలోను, కథా బలంలోను కాంప్రమైజ్ చేయని వారు కావడంతో ప్రేక్షకుల అంచనాలు తప్పవు. "కాంతార 3"లో ఎన్టీఆర్ పాత్ర ఒక ట్విస్ట్ కాదు, టెంపరేచర్ అంటున్నారు ఫ్యాన్స్! ఈ కాంబో కనుక నిజమైతే, సౌత్ ఇండియన్ సినిమాకు ఓ సరికొత్త మైథో మాస్ ఫేస్ ఆఫ్ ఆరంభమవుతుందంటే అతిశయోక్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: