ఆగస్టు 15 – ప్రతి భారతీయుని గుండె గర్వంతో నిండే రోజు. దేశం బానిసత్వం నుంచి విముక్తి పొందిన చారిత్రాత్మక క్షణం. ప్రతి ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట నుంచి భారత ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు . కానీ, ఎందుకు ఎర్రకోటే ? మరే భవనం ఎందుక్కాదు ? ఇది కేవలం ఒక సంప్రదాయమే కాదు – ఇది భారత స్వాతంత్ర్య చరిత్ర లో ఓ గొప్ప పుట . ఎర్రకోట … అంటే ఓ చిహ్నం . ఓ శక్తి ప్రదర్శన. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638 లో దీనిని నిర్మించాడు . అద్భుత శిల్పసౌందర్యాని కి నిలువెత్తు నిదర్శనం . కానీ నిజమైన చరిత్ర మొదలైనది 1947లో. ఆగస్టు 15, 1947 – అదే రోజు భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశానికి స్వేచ్ఛ గెలిచినట్టు ప్రకటించారు .

అదే క్షణం నుంచీ ఎర్రకోట భారత గర్వానికి ప్రతీకగా మారింది . ప్రతి ఏడాది అక్కడి నుంచే ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎందుకంటే …

స్వాతంత్ర్య ఘట్టానికి నిదర్శనంగా  ఈ ప్రదేశం నిలుస్తుంది.

* దేశ భద్రతా పరంగా అత్యంత రక్షణ కలిగిన ప్రాంతం.

* ఎర్రకోట ఢిల్లీ నగర మధ్యలో ఉండటంతో ప్రజలకు సులభంగా చేరుకునే ప్రదేశం.

* ప్రజల మనస్సులో ఈ కోటకు ఉన్న భావోద్వేగం విస్తారంగా ఉంటుంది.

ఇవన్నీ కలిసే ఎర్రకోటను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేంద్రబిందువుగా మలిచాయి . ఇది కేవలం ఒక జెండా ఎగురవేసే వేడుక కాదు – ఇది భారత జాతీయతకు , స్వేచ్ఛ కోసం పోరాడిన వేలాది మంది వీరుల త్యాగాలకు నివాళి . ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట పై రెపరెపలాడే త్రివర్ణ పతాకాన్ని చూస్తే గుండె గర్వం తో నిండిపోతుంది . ఎందుకంటే ఇది మనం స్వేచ్ఛగా ఉన్నామని , ఆ స్వేచ్ఛ వెనుక ఒక గొప్ప పోరాటం ఉన్నదని గుర్తుచేస్తుంది   ..

మరింత సమాచారం తెలుసుకోండి: